Former CID chief Sanjay : వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగారు ఐపీఎస్ సంజయ్ కుమార్. సిఐడి చీఫ్ గా జగన్ సర్కార్ సంజయ్ కుమార్ ను నియమించింది. చాలా దూకుడుగా వ్యవహరించిన సంజయ్ టిడిపి నేతలను వెంటాడారు.వేటాడినంత ప్రయత్నం చేశారు. టిడిపి హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని టార్గెట్ చేసుకున్నారు. పాత కేసులను తిరగదోడి మరి వారిని అరెస్టు చేశారు. చివరకు మాజీ సీఎం చంద్రబాబు నంద్యాలలో ఉంటే అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు. నరకం చూపించారు. తాను ఒక ఐపీఎస్ అధికారిని అన్న విషయాన్ని మరిచిపోయారు. అసలు సిసలైన వైసీపీ కార్యకర్తగా మారిపోయారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించి.. ఎటువంటి ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా మార్చేశారు. అంతటితో ఆగకుండా అప్పటి ఏసీబీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తో కలిసి దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ప్రెస్ మీట్ లు పెట్టారు. తాను ఒక అధికారినని మరిచిపోయి వ్యవహరించారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో అడ్డంగా బుక్కయ్యారు. ఇలా ఫలితాలు వచ్చిన మరుక్షణం విదేశాలకు వెళ్లిపోయేందుకు నిర్ణయించారు. కానీ కూటమి ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. రిజర్వులో పెట్టింది. ఆయన ఉద్యోగం ప్రమాదకరంగా మారింది. ఇటువంటి తరుణంలో ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. శాఖా పరమైన అంశాల్లో సైతం ఆయన కక్కుర్తి వెలుగులోకి వచ్చింది. సిఐడి చీఫ్ గా ఉండగా భారీ అవినీతికి తెరతీసినట్లు తెలియ వచ్చింది.
* అడ్డగోలుగా డ్రా చేశారు
సిఐడి చీఫ్ గా ఉన్న సంజయ్.. ఎస్సీ ఎస్టీ చట్టంపై అవగాహన సమావేశాలు పెడతానంటూ కోటి రూపాయలకు పైగా డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు లక్షల మాత్రమే ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు డ్రా చేసుకోవడంతో ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. విజిలెన్స్ విచారణలో తేలడంతో జైలుకెళ్లే ప్రమాదాన్ని తెచ్చుకున్నారు. ఇక పోస్టింగ్ దక్కే అవకాశం ఆయనకు లేదు. ఎస్సీ ఎస్టీలను అడ్డం పెట్టుకొని ఆయన ఇలా ప్రజాధనం దోచుకోవడం పై.. సివిల్ సర్వీస్ అధికారుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కానీ ఆయన చాలా కక్కుర్తి అధికారి అని శాఖా పరంగా ఒక అపవాదు ఉంది. పోలీస్ అధికారుల బదిలీల్లో ఆయన లంచం తీసుకుని దొరికిపోయారని.. అప్పట్లో వైసీపీ నేతలు దీనిని అడ్డం పెట్టుకొని ఆయనతో పని చేయించుకున్నారు అన్నది ఒక అభియోగం.
* ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో
అప్పటి వైసిపి పెద్దల అడుగులకు మడుగులొత్తడంతో శాఖాపరమైన అంశాల్లో అడ్డగోలు దోపిడీకి తెర తీశారు సంజయ్. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీలకు చట్టంపై అవగాహన కల్పిస్తానని చెబుతూ పెద్ద ఎత్తున డబ్బులు డ్రా చేసుకున్నారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ కు పోస్టింగ్ లేదు. ఇప్పుడు సరికొత్తగా ఈ స్కాం బయటపడడంతో ఆయనపై చర్యలు ఖాయం. అయితే సంజయ్ చర్యలను తోటి ఐపీఎస్ అధికారులు సైతం అసహ్యించుకుంటున్నారు. ఇటువంటి వారి వల్లే బ్యూరోక్రసీ వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని.. రాజకీయ వ్యవస్థ వద్ద చేతులు కట్టుకోవాల్సి వస్తోందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.