8 November: మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌లకు కలిసి రాని 8వ నంబర్..ఇద్దరికి సేమ్ రిజల్ట్

మహేష్ బాబు పవన్ కళ్యాణ్ జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఓ టాప్ హీరో మరో టాప్ హీరో సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం

Written By: Mahi, Updated On : November 4, 2024 11:19 am

November 8

Follow us on

8 November: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాన్ లు తమ జనరేషన్ లో టాప్ హీరోలు. అలాగే వీరిద్దరూ మంచి మిత్రులు కూడా. ఇక మహేష్ బాబు పవన్ కళ్యాణ్ జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఓ టాప్ హీరో మరో టాప్ హీరో సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఇక వీరిద్దరూ ఒకరి సినిమాల ఓపెనింగ్స్ కు మరొకరు వెళ్తుంటారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పవన్ కల్యాన్, మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ తో కలిసి వేర్వేరుగా మల్టీస్టారర్ సినిమాలు చేయగా, అవి రెండు సూపర్ హిట్లయ్యాయి. మహేష్ బాబు, వెంకటేష్ తొలిసారి కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్టయ్యింది. అలాగే పవన్ కల్యాన్, వెంకటేష్ కలిసి చేసిన గోపాల గోపాల కూడా సూపర్ హిట్టయ్యింది. మల్టీస్టారర్ సినిమాలకు మహేష్ బాబు, పవన్ కల్యాన్ ఓకే చెబుతున్నా, కానీ వీరికి సరైన కథ లభించకపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా మల్టీస్టారర్ కు మాత్రం బీజం పడడం లేదు.

ఇక వీరిద్దరికి ఓ సినిమా విషయంలో చాలా సారూపత్య ఉన్నది. ఆ సినిమాలు వారిద్దరికి 8వ సినిమాలు కావడం, ఆ రెండు ప్లాఫ్ లు కావడం యాదృచ్చికం. ఇందులో మరో సారూప్యత కూడా ఉంది. ఆయా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టరే మూవీలోని మొత్తం పాటలన్నీ పాడడం విశేషం. ఆ సినిమా ల వివరాలేంటో తెలుసుకుందాం.

డబుల్ హ్యాట్రిక్ హిట్ల తర్వాత పవన్ కల్యాన్ నటించిన చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. ఆ సినిమాకు పవన్ కల్యాణ్ దర్శకత్వం వహించడం విశేషం. అదే జానీ. ఖుషీ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అదీ పవన్ కల్యాన్ తొలిసారి డైరెక్టర్ మారి చేసిన సినిమా కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది.

జానీ సినిమా పవన్ కల్యాన్ కు 8వ సినిమా. ఈ సినిమా కు పవన్ దర్శకత్వం వహించగా, రమణ గోగుల మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమాలోని పాటలన్నీ రమణ గోగులనే పాడడం విశేషం. ఇందులో అక్కడకక్కడా పవన్ కల్యాణ్ హమ్మింగ్ చేశాడు. పవన్ కల్యాణ్ కెరీర్ తొలి భారీ డిజాస్టర్. డబుల్ హ్యాట్రిక్ హిట్ల తర్వాత ఈ రేంజ్ ప్లాఫ్ తెలుగులో ఏ హీరోకు ఎదురు కాలేదు.

మహేష్ బాబుకు ఎదురైన చేదు ‘నిజం’
మహష్ బాబు తొలిసారి కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ఒక్కడు. ఈ సినిమా మహేష్ బాబును టాలీవుడ్ లో మాస్ హీరోగా నిలబెట్టింది. అదే సమయంలో దర్శకుడు తేజ జయం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అటు మహేష్ బాబు, ఇటు తేజ చెరో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా నిజం. అవినీతి, లంచం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఇందులోని పాటలన్నీ ఆర్పీయే పాడడం విశేషం. ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో ఊహించని డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఇందులో మహేష్ బాబు నటనకు నంది అవార్డు వచ్చింది.

ఒకే ఏడాది నాలుగు వారాల గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు తెలుగు ఇండస్ర్టీకి భారీ డిజాస్టర్లు మిగలడం ఓ మచ్చగా మిగిలిపోయింది. జానీ సినిమా 2003 ఏప్రిల్ 25న రిలీజ్ కాగా, నిజం సినిమా 2003 మే 23న విడులయ్యాయి. ఈ రెండు సినిమాలు అటు నిర్మాతలు, ఇటు డిస్ట్రిబ్యూటర్లను కోలుకోలేని దెబ్బతీసింది.