Chandrababu: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో తాము ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రాబోమని స్పష్టం చేశారు. ఇక జెడి యు నేత నితీష్ కుమార్ సైతం కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఫలితంగా మోడీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే అటు జేడీయు, ఇటు టిడిపితో హాయిగా ప్రయాణం సాగిస్తున్న ఎన్డీఏ కూటమికి.. అనుకోని షాక్ తగిలింది. టిడిపి నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అలాంటి పరిస్థితినే కల్పిస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన టిడిపి నాయకుడు నవాబ్ జాన్ అమీర్ బాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి.
మద్దతు ఇచ్చేది లేదు..
టిడిపి ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులకు టిడిపి కచ్చితంగా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కేంద్రం తాజాగా వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురానుంది. అయితే దీనిపై టిడిపి నేత నవాబ్ జాన్ స్పందించారు..”ఈ బిల్లును చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. ఈ సవరణ బిల్లు సరికాదని అంటున్నారు. చంద్రబాబు ఉదార స్వభావం ఉన్న వ్యక్తి. ఆయన అన్ని మతాలను సమానంగా చూస్తారు. వక్ఫ్ బోర్డు ముస్లింలకు చెందింది. అందులో సభ్యులు కూడా ముస్లింలు మాత్రమే ఉండాలి. వక్ఫ్ సవరణ బిల్లును అందరు వ్యతిరేకించాలి. డిసెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ లో జమియత్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. దానికి చంద్రబాబు హాజరవుతారని” నవాబ్ వ్యాఖ్యానించారు. ఐతే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై టిడిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
ప్రమాదకరమైనది
వక్ఫ్ సవరణ బిల్లు సరికాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇప్పటికే ప్రకటించింది. వక్ఫ్ చట్టాలను మార్చడం సరికాదని స్పష్టం చేసింది.. ఈ బిల్లు చట్టం గా రూపాంతరం చెందితే మసీదుల నుంచి మొదలు పెడితే మదర్సాల వరకు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది.. అయితే ఈ బిల్లును కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే అనేక పార్టీలు దీనిని నేర్పించాయి. క్రమంలో కేంద్రం జగదాంబికా పాలు ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించింది.. ఇందులో పార్లమెంటు నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి పది మంది ఉన్నారు. అయితే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇప్పటివరకు 90 లక్షలకు పైగా సూచనలు ఈ మెయిల్ ద్వారా వచ్చాయి. ఇక ఈ సవరణ బిల్లు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దేశం నుంచి పలు రాష్ట్రాలలో ప్రకటిస్తుంది. నవంబర్ 9న అస్సాం రాష్ట్రం నుంచి పర్యటనకు శ్రీకారం చుడుతుంది. నవంబర్ 11న ఒడిశాలో సమావేశం అవుతుంది. కోల్ కతా, లక్నో, పాట్నాలో కూడా ఈ బృందం పర్యటన సాగిస్తుంది.