Ropeway In AP
Ropeway In AP: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే సీ ప్లేన్ తో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను కలుపుతూ మార్గాన్ని ఏర్పాటు చేసింది. విజయవంతంగా సిప్లేన్లను నడుపుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రవ్యాప్తంగా రోప్ వేల నిర్మాణం పై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఐదు చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎందుకు సంబంధించి నేషనల్ హైవే లాజిస్టిక్ అథారిటీతో ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read: విజయసాయిరెడ్డికి ఓకే.. చంద్రబాబుతో చర్చించనున్న బిజెపి పెద్దలు
* రాష్ట్ర వ్యాప్తంగా ఐదుచోట్ల..
రోప్ వేలు( rope ways) ఇప్పటికే విశాఖ నగరంలో అందుబాటులో ఉన్నాయి. నగరంలోని కైలాసగిరి వద్ద వీటిని ఏర్పాటు చేశారు. పర్యాటకులను సైతం ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఐదు చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమ్మ ఆలయం, నంద్యాల జిల్లాలోని అహోబిలం, పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ, విజయవాడలోని భవానీ ద్వీపం, తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేయనున్నారు. రూప్ వేలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం.
* టిడిపి హయాంలో ప్రతిపాదనలు..
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలోనే ఈ ప్రాజెక్టుల కోసం ప్లాన్ చేసింది. అప్పటిలో నివేదికలను సైతం రూపొందించింది. అయితే తర్వాత వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో కొంత కదలిక వచ్చింది. ఇప్పటికే పర్యాటక శాఖ అధికారులు కొన్ని ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు. ఒకటి రెండు చోట్ల డిపిఆర్లను సైతం తయారు చేశారు. జాతీయ రహదారుల లాజిస్టిక్ అథారిటీతో మాట్లాడిన తర్వాత రూప్ వేల నిర్మాణానికి అడుగులు వేయాలని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు భావిస్తున్నారు. అవసరం అనుకుంటే ప్రభుత్వం సైతం నిధులు వెచ్చించేందుకు ఆలోచన చేస్తోంది.
* డ్రోన్ల హబ్ గా అమరావతి..
గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో పర్యాటక రంగానికి( tourism field) ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవు. ఆ శాఖలో అభివృద్ధి కూడా అంతంతమాత్రంగానే ఉండేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంపై దృష్టి పెట్టడం విశేషం. మరోవైపు రాష్ట్రంలో డ్రోన్ రంగంలో పెట్టుబడిదారులు, వ్యాపారులు, ప్రజలను అనుసంధానం చేసేందుకు ఏపీ డ్రోన్ మార్ట్ పేరిట ఓ పోర్టల్ ను డ్రోన్ కార్పొరేషన్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. డ్రోన్ల తయారీ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తగిన ప్రతిపాదనలతో రావాలని సంస్థ కోరింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం డ్రోన్ల హబ్ గా అమరావతిని తీర్చిదిద్దాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ropeway in ap 5 locations in andhra pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com