RK Kotha Paluku: మిగతా పత్రికల ఓనర్లు వేరు. మిగతా చానల్స్ ఓనర్లు కూడా వేరు. ఎందుకంటే వారు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ మాదిరిగా రాయలేరు. రాజకీయాలలో లోతైన విషయాలను బయట పెట్టలేరు. స్వతహాగా రాధాకృష్ణ పాత్రికేయుడు కావడంవల్ల కొన్ని అంతర్గత విషయాలను ఆయన బయటపెడుతుంటాడు. ఇలా బయటపెట్టే విషయంలో ఆయన ఏమాత్రం వెనకడుగు వేయడు. ఆయన జర్నలిజం లో ఉండే బ్యూటీ ఇదే.
Also Read: కాశీబుగ్గ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు బిగ్ రిలీఫ్!
జాగా తన పత్రికలో రాసిన కొత్త పలుకులో ఈసారి రాధాకృష్ణ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా జగన్, చంద్రబాబు విషయంలో మొహమాటం లేకుండా అనేక విషయాలను వెల్లడించారు. అందులో ప్రధానంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి “నార్స్ స్టిక్” వ్యాధి ఉందని రాధాకృష్ణ తేల్చేశారు. అందువల్లే ఆయన ఇతరులను గుర్తించరని.. తను తాను గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటారని రాధాకృష్ణ పేర్కొన్నారు. అంతేకాదు నార్సి స్టిక్ వ్యాధికి సంబంధించి మయో క్లినిక్ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించిందని.. ఆ వ్యాధి జగన్మోహన్ రెడ్డిలో ఉందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాకుండా.. ఈ ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు మొత్తం అలానే ఉంటారు. చివరికి రాధాకృష్ణ గొప్పగా చెప్పే చంద్రబాబు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. ఆ ప్రకారం చేసుకుంటే చంద్రబాబులో కూడా ఇదే వ్యాధి ఉందని అనుకోవాలా.. అధికారంలో ఉన్న ఏ నాయకుడు కూడా ప్రచారాన్ని కోరుకుంటాడు. తన గురించి గొప్పగా చెప్పుకోవాలని భావిస్తుంటాడు. అందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడు. ఆ మాత్రం దానికి జగన్మోహన్ రెడ్డిని మాత్రమే విలన్ గా చూపించడం ఎంతవరకు కరెక్ట్?
తుఫాన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా విమర్శించారని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇందులో కాస్త నిజం కూడా ఉంది. ఎందుకంటే తుఫాన్ ను ఎదుర్కొనే విషయంలో చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఇందులో ఆయన కాస్త అతి ప్రదర్శించారని రాధాకృష్ణ రాశారు. వాస్తవానికి ఏపీ అనేది తీర ప్రాంతం అధికంగా ఉన్న రాష్ట్రం.. పైగా తుఫాన్ కూడా అక్కడే కేంద్రీకృతమై ఉంది. పైగా గతంలో హుద్ హుద్ తుఫాన్ సంబంధించినప్పుడు ఏపీ ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొందో అందరికి తెలుసు. అందువల్లే చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగా అధికారులను అప్రమత్తం చేశారు. సిబ్బందికి సూచనలు చేశారు. అయితే ఇది కొంతమందికి అతిలాగా అనిపించవచ్చు. వాస్తవానికి ఏపీ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి.. ఇటువంటి ఘటన జరిగినా సరే ఆయనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి.. విమర్శ చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ రాధాకృష్ణ కూడా అలా మాట్లాడడం నిజంగా ఆశ్చర్యకరం.
తుఫాన్ నేపథ్యంలో బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు వైసీపీ నుంచి లభించలేదు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా రాజకీయాలను పక్కనపెట్టి వైసిపి క్షేత్రస్థాయిలో పని చేయాల్సి ఉండేది. వరద బాధితులకు అండగా ఉంటే బాగుండేది. కానీ ఇవన్నీ పక్కనపెట్టి తుఫాన్ చంద్రబాబు వల్ల వచ్చిందని.. దానిని ఎటువంటి పదవులు లేకున్నా సరే ఆపిన మగాడు జగన్మోహన్ రెడ్డి అని వైసిపి పేర్కొనడం.. అదే విషయాన్ని రాధాకృష్ణ ప్రస్తావించడం ఈ వారం కొత్త పలుకులో హైలైట్. వాస్తవానికి తుఫాన్ ముందు జగన్ ఏపీలో కనిపించలేదు. తుఫాన్ తగ్గిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చారు. చివరికి మళ్లీ బెంగళూరు వెళ్ళిపోయారు. ఇటువంటి బాధ్యత లేని నాయకుడికి పదవి ఎందుకివ్వాలి.. ముఖ్యమంత్రిని మళ్లీ ఎందుకు చేయాలి.. ఇప్పుడు ఇదే ప్రశ్నను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రస్తావించారు. కాకపోతే దానికి సమాధానం చెప్పే దమ్ము వైసిపికి లేదు. సాక్షికి అంతకన్నా లేదు. కానీ మొత్తం కొత్త పలుకులు తెలంగాణ ప్రస్తావనను రాధాకృష్ణ కనీసం తీసుకురాలేదు.