YS Sharmila: కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటన యావత్ రాష్ట్రాన్ని వణికించింది. చివరకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యం అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అయితే ఒక అడుగు ముందుకేసి తమ పార్టీ వారు పోలీస్ బందోబస్తు కావాలని కోరినా స్పందించలేదని చెప్పుకొచ్చారు. అందుకే తాను రంగంలోకి దిగినట్టు ప్రకటించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే వైసీపీ రాజకీయం చేయాలని భావించింది. రాజకీయ రంగు పూసింది. అంతవరకూ ఓకే కానీ.. జగన్ మాత్రం శ్రీకాకుళం వచ్చేందుకు అంగీకరించడం లేదు. కాశీబుగ్గ ఎందుకు కానీ.. తాడేపల్లి పరిధిలో..కూతవేటు దూరంలో తుఫాను బాధితులను సైతం పరామర్శించకపోవడం కొత్త విమర్శలకు తావిస్తోంది.
Also Read: కాశీబుగ్గ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు బిగ్ రిలీఫ్!
అయితే మొన్న తుఫానును అలానే చూశారు. దానిని రాజకీయ కోణంలో చూశారు. చూపించే ప్రయత్నం చేశారు. బెంగళూరు నుంచి తుఫాను నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దయ్యాయని చెప్పి అక్కడే ఉండిపోయారు. ఒక రోజు తరువాత పునరుద్ధరించడంతో తీరుబాటుగా చేరుకున్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఇలా అందరూ తుఫాను సహాయ చర్యల్లో పాల్గొనేసరికి జగన్ లో చలనం వచ్చింది. అంతకు ముందే బెంగళూరు నుంచి విమాన సర్వీసులు రద్దయ్యాయని చెప్పిన ఆయన ఎటువంటి సమీక్షలు, పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్సులు జరిపినట్టు చెప్పలేదు. ఎప్పుడైతే తాడేపల్లిలో అడుగుపెట్టారో సాక్షి ఈశ్వర్ రంగంలోకి దిగారు. టెలీకాన్ఫరెన్స్ పెట్టినట్టు చెప్పారు. ఎవరు చెప్పారు జగన్ ఖాళీగా ఉన్నారంటూ లౌడ్ స్పీకర్లతో మొదలుపెట్టారు. అయితే కొట్టండి చప్పట్లు.. పెట్టండి డీజేలు అంటూ ఏవేవో మాట్లాడి ఈశ్వర్ కామెడీ పీస్ అయ్యారు. జగన్ గురించి ఆయన జాకీలు పెట్టి లేపేసరికి అంతా అసలు విషయం అర్ధం చేసుకున్నారు.
ఇప్పుడు జగన్ కంటే ఆయన సోదరి షర్మిళ నయమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. తుఫాను వచ్చే నాటికి ఆమె ఎక్కడున్నారో తెలియదు.. కానీ తుఫాను వచ్చిన తరువాత బాధితులను పరామర్శించేందుకు నేరుగా పొలాల్లోనే అడుగుపెట్టారు. రైతులను పరామర్శించి జగన్ కంటే తానే నయం అన్న పరిస్థితికి తీసుకొచ్చారు. జగన్ పొలాల వైపు చూడకుండా కాశీబుగ్గ ఘటనపై రాజకీయ విమర్శలు చేస్తూ బెంగళూరు బయలుదేరి వెళ్లిపోయారు. జగన్ వచ్చిందే ఆలస్యం.. ఆపై ఆయన సోదరి సైతం వచ్చిందే లేటు అయినా..తన అన్న కంటే లేటెస్టు అన్నట్టు ఆమె వ్యవహరించి అందర్నీ ఆకట్టుకున్నారు.