YS Jagan Kashi Bugga Incident: జగన్ శ్రీకాకుళం వస్తారా? కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై స్పందిస్తారా? బాధిత కుటుంబాలను పరామర్శిస్తారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఎందుకంటే జగన్ కదలికలే ఇప్పుడు సోషల్ మీడియాకు ఆహారం. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జగన్ మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మైండ్ అప్లయ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందని ఆయన చెప్పిన మాటలు నెటిజన్లకు మైండ్ బ్లాక్ అయ్యాయి. ఆయన్ను అభిమానించే వారికి అవి గొప్ప మాటలే అయినా.. రాజకీయాలతో సంబంధం లేనివారికి.. ఫన్నీ కామెంట్స్ గా మిగిలిపోయాయి. అయితే మొన్నటి వరకూ మొంథా కొనసాగింది. తుఫాను వచ్చి వెళ్లిపోయింది. కానీ ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం.. పంటలకు నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి గురుడు రాలేదు.. లేకుంటే వచ్చేవాడు అంటూ ప్రత్యర్థులతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారు పోస్టులు పెడుతున్నారు. కామెంట్లు చేస్తున్నారు.
Also Read: కాశీబుగ్గ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు బిగ్ రిలీఫ్!
కాశీబుగ్గలో ఊహకందని విషాదం. దీనిని రాజకీయం చేస్తామంటే కుదరదు. ఎందుకంటే వైసీపీ హయాంలోనే ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆపై ప్రైవేటు వ్యక్తి ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. పేద, మధ్యతరగతి ప్రజలకు భగవంతుడి కరుణ చూపించాలని.. సర్వదర్శనం కల్పించాలని నిర్మించిన ఆలయం అది. ఎందుకంటే మొత్తం నిర్మాణం జరిపించుకున్నది వైసీపీ హయాంలోనే. ఆపై ఎవరి వద్ద కలెక్షన్లు చేయలేదు. ఎటువంటి లాభాపేక్ష లేదు. ఎందుకంటే తెల్ల బంగారంగా చెప్పుకునే పలాస జీడి పరిశ్రమలు వర్థితున్న జంట పట్టణాల్లో ఇటువంటివి చేపట్టడం నిజంగా అభినందనీయమే. దీనిని రాజకీయం చేస్తామంటే కుదరని పని కాదు. అస్సలు దీనిని ఊహించకూడదు కూడా.
ఉద్దానం ప్రాంతీయులకు రాజకీయ చైతన్యం, పోరాటే తత్వం పుష్కలం. ఎందుకంటే 2018లో వచ్చిన తితలీ తుపానుకు ఎక్కువగా నష్టపోయింది పలాస నియోజకవర్గమే. బంగాళాఖాతంపై ఏర్పడి, విరుచుకుపడే విపత్తులు ఎక్కువగా ఉగ్రరూపం దాల్చేది శ్రీకాకుళం జిల్లాపైనే. పైగా చంద్రబాబుకు వరమో శాపమూ తెలియదు కానీ.. 1999 సూపర్ సైక్లోన్ నుంచి మొన్నటి తితలీ తుపాను వరకూ .. ప్రతి నాలుగేళ్లకు వచ్చే పెను తుఫాను చంద్రబాబు హయాంలో వచ్చిందే.. ఆయన ప్రతి విపత్తును ఎదుర్కొంటూ వచ్చారు. కానీ ఇతర రాష్ట్రాల వారు గుర్తించారు. కానీ ఈ ప్రాంతీయులు మాత్రం చంద్రబాబు సేవలను గుర్తించలేదు. పైగా ఓడించిన సందర్భాలే అధికం.
అయితే పాడిన పాటే పాడితే పాచిపళ్లు దాసరా అన్నట్టు.. పాపం చంద్రబాబు చర్యలు పట్ల ఇప్పుడు గుర్తించుకుంటున్నారు ఈ ప్రాంతీయులు. జగన్ కిడ్నీ ఆస్పత్రే కట్టించాడు. కానీ అంతకు ముందే ఈ సమస్యను జాతికి చాటిచెప్పింది పవన్ కళ్యాణ్. సమస్యకు పరిష్కార మార్గాలు వెతుకుతూ అన్వేషించింది చంద్రబాబు. జగన్ వద్దకు వచ్చేసరికి విరుగుడు కనిపెట్టారు. కానీ మందు ఇవ్వలేదు. రోగాన్ని నియంత్రించే శక్తి ఇవ్వలేదు. కూటమి వచ్చేసరికి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇచ్చారు. కొంతవరకూ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అందుకే కాశీబుగ్గ తొక్కిసలాట జరగడం, మరణాలు సంభవించడంతో దానిని రాజకీయం చేస్తామంటే జగన్ కు కుదిరే పనికాదు. అయితే మరణాలు సంభవించాయి.. కదా అని సాహసిస్తే వర్కవుట్ అయ్యే అవకాశమే లేదు.