Renuka choudary comments on Jagan : ఏపీలో ( Andhra Pradesh) ఇప్పుడు టీవీ డిబేట్లో మాటలు కోటలు దాటుతున్నాయి. విమర్శలు అపహాస్యానికి గురవుతున్నాయి. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు జర్నలిస్ట్ కృష్ణంరాజు. మరోవైపు టీవీ యాంకర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాదులో కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఈ వ్యవహారంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పై రేణుక చౌదరి చేసిన కామెంట్స్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆమెపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి.
* టీవీ5 డిబేట్లో. అమరావతి( Amaravathi ) అంశంపై టీవీ5 ఛానల్ డిబేట్ నిర్వహించింది. అందులో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఫోన్ ద్వారా ఆమె ఈ డిబేట్లో పాల్గొనగా.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల విషయంలో.. కనీసం మీడియా ముందుకు వచ్చే సాహసం చేయని వెధవ అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినప్పుడే విజయమ్మ గొంతు నులిమేసి ఉంటే పీడా పోయేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సదరు టీవీ యాంకర్ వారిస్తున్నప్పటికీ.. అలా మాట్లాడడం సరికాదు అంటున్నప్పటికీ రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం రేణుక చౌదరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* అమరావతికి వ్యతిరేకి..
అమరావతి రాజధాని కి ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వ్యతిరేకి అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు రేణుకా చౌదరి. మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారని విమర్శించారు. అమరావతి ఉద్యమానికి అప్పట్లో తాను మద్దతు తెలిపిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయినప్పటికీ.. అమరావతి పై ఉన్న కక్ష పోవడం లేదని విమర్శించారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. బాధ్యతగల పదవిలో ఉంటూ.. ఓ మాజీ ముఖ్యమంత్రిని అలా అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. టీవీ5 యాంకర్ మూర్తితో పాటు రేణుకా చౌదరి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
* గతం నుంచి విమర్శలు..
అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో రేణుకా చౌదరి( Renuka Chaudhari ) చాలాసార్లు విమర్శలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారని అప్పట్లో మండిపడ్డారు. జగన్ వేషలను తండ్రిగా వైయస్సార్ బయటకు రాకుండా కాపాడాలని ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి తాను వ్యతిరేకిని కాదని.. జగన్ తన కొడుకు లాంటివాడని.. అతని భవిష్యత్తు కోసమే అలా మాట్లాడాను అంటూ అప్పట్లో వివరణ ఇచ్చారు.
మూర్తి , రేణుకా చౌదరిల అరెస్టు ఎప్పుడు??? pic.twitter.com/OXyu6afaig
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) June 9, 2025