Rajamouli – Prabhas : దర్శకధీరుడి గా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)… ప్రస్తుతం ఆయన మహేష్ బాబు (Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇంతకుముందు ప్రభాస్ తో ఆయన చేసిన బాహుబలి (Bahubali) సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టింది.
రాజమౌళి తీసిన అన్ని మూవీస్ మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) లాంటి నటులతో చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా కూడా అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టింది. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ప్రస్తుతం రాజమౌళి ఈ స్టేజ్ లో ఉండడానికి ప్రభాస్ కూడా ఒక కారణమని చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి బాహుబలి ఈవెంట్ లో రాజమౌళి చెప్పిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవి ఏంటి అంటే మొదట రాజమౌళి ప్రభాస్ దగ్గరికి వెళ్లి బాహుబలి మూవీ కోసం ఒక సంవత్సరం పాటు మీ డేట్స్ అయితే కావాలని చెప్పారట. దానికి ప్రభాస్ చిన్నగా నవ్వి ఒక సంవత్సరంలో మన సినిమా పూర్తి అవ్వదు డార్లింగ్, మీకోసం రెండు సంవత్సరాలు నా డేట్స్ మొత్తాన్ని ఈ సినిమా మీద కేటాయిస్తానని చెప్పారట.
Also Read : తనదైన స్టైల్ లో ‘స్పిరిట్’ హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించిన సందీప్ వంగ..!
అలాగే ఏదైనా ఒక షెడ్యూల్ చేయాలి అనుకున్నప్పుడు ప్రభాస్ డేట్స్ కావాల్సి వచ్చినపుడు రాజమౌళి వెళ్ళి నాకు ఒక 20 రోజులు మీ డేట్స్ కావాలి అని అడిగేవాడట. దానికి ప్రభాస్ 20 రోజుల్లో మన షూట్ అవ్వదు డార్లింగ్ నెల రోజులు తీసుకోండి అంటూ రాజమౌళి ఎప్పుడూ అడిగితే అప్పుడు అడిగిన డేట్స్ కంటే ఎక్కువ డేట్స్ ఇస్తూ వచ్చారట.
అలా ప్రభాస్ రాజమౌళి ని ఎంకరేజ్ చేయడం వల్లే డేట్స్ అయిపోతున్నాయి అనే బాధ లేకుండా రాజమౌళి చాలా నిదానంగా తను అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగాడట…ఇక మొత్తానికైతే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించడంతో అటు రాజమౌళి(Rajamouli)కి, ఇటు ప్రభాస్(Prabhas) ఇద్దరికి మంచి పేరు అయితే వచ్చింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు రాజమౌళి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రభాస్ కూడా ఒక ముఖ్య కారణం అంటూ వాళ్లు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వైరల్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈ ఇద్దరు ఇకమీదట మరిన్ని మంచి సినిమాలు చేసి యావత్ ఇండియన్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాలని కోరుకుందాం.