Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి ఎందుకు వెనక్కి తగ్గారు? కేసులకు భయపడ్డారా? కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎదురైందా? లేకుంటే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. 2014 నుంచి 2019 మధ్య కూడా పోసాని కృష్ణమురళి వైసిపి వాయిస్ వినిపించారు. అంతెందుకు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆయన గట్టిగానే మాట్లాడారు.వైసీపీలో పదవులు అనుభవించిన వారు సైతం బయటకు రాని పరిస్థితి. ఆ సమయంలో కూడా కూటమి ప్రభుత్వ తీరును, వైఫల్యాలను బయటపెట్టారు పోసాని. కేసులుకైనా సిద్ధం అని ప్రకటించారు. కానీ ఉన్నట్టుండి ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు. అసలు తనకు వైసిపి తో సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. వైసీపీ సభ్యత్వం తీసుకోలేదని కూడా చెప్పుకొచ్చారు.అయితే ఒక్కసారిగా పోసాని కృష్ణమురళిలో ఈ మార్పు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ నడుస్తోంది. అయితే పోసాని కృష్ణ మురళి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు తెలుస్తోంది.
* గత ఐదేళ్లుగా గౌరవం
పోసాని కృష్ణ మురళి వైసీపీ నేతగా చలామణి అయ్యారు. గత ఐదేళ్లపాటు పార్టీ వ్యక్తిగా గౌరవం పొందారు.ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు జగన్.అది మంచి పదవి కూడా.అయితే గత ఐదేళ్లుగా జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే.. డైరెక్ట్ అటాక్ చేసేవారు పోసాని. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం జగన్ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా సినిమాలు తీసేవారు. వారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు.ఆయన పార్టీ నేత కాదు.కానీ మించి ఆయాచిత లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఆయనతో పోల్చుకుంటే పోసాని పెద్దగా లబ్ది పొందలేదని సమాచారం.
* కనీసం పేరు ప్రస్తావించకపోవడంతో
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా జరుగుతున్నాయి.దీనిపై జగన్ స్పందించారు.అరెస్టులను ఖండించారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ ప్రస్తావన తీసుకొచ్చారు.కనీసం పోసాని కృష్ణ మురళి ప్రస్తావన లేకుండా పోయింది.పార్టీ కోసం ఇంత కష్టపడితే తనను కాకుండా.. పార్టీతో సంబంధంలేని రాంగోపాల్ వర్మ పేరు ప్రస్తావించడాన్ని పోసాని తట్టుకోలేకపోయారట.అందుకే హడావిడిగాపార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సామాజిక వర్గ పెద్దలు,కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోసాని వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం.