https://oktelugu.com/

Game Changer: దీనెమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది, గేమ్ ఛేంజర్ విలన్ సంచలన ట్వీట్, ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

రామ్ చరణ్ కెరీర్లో ఫస్ట్ టైం పొలిటికల్ డ్రామా చేస్తున్నారు. దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ టైటిల్ తో భారీ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా ఈ మూవీ పై ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు, ఎస్ జే సూర్య. ఆయన ట్వీట్ సంచలనం రేపుతోంది.

Written By:
  • S Reddy
  • , Updated On : November 22, 2024 / 02:32 PM IST

    Game Changer(6)

    Follow us on

    Game Changer: ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కి ఆచార్య రూపంలో ప్లాప్ పడింది. దర్శకుడు కొరటాల తెరకెక్కించిన చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆచార్య నిరాశపరిచింది. రాజమౌళి సెంటిమెంట్ రామ్ చరణ్ ని వెంటాడింది. దాంతో ఒక సాలిడ్ హిట్ ఇచ్చేందుకు రామ్ చరణ్ సిద్ధమయ్యారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో పొలిటికల్ థ్రిల్లర్ కి సైన్ చేశాడు. సోషల్, పొలిటికల్ ఇష్యూస్ ఆధారంగా కమర్షియల్ సబ్జక్ట్స్ తెరకెక్కించడంలో శంకర్ దిట్ట. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు ట్రెండ్ సెట్టర్. దేశాన్ని ఊపేసిన చిత్రం అది.

    చాలా కాలం తర్వాత శంకర్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్… పొలిటీషియన్ గా, ఐఏఎస్ అధికారికంగా కనిపించనున్నారని సమాచారం. గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వెళ్లి చాలా కాలం అవుతుంది. భారతీయుడు 2 కారణంగా ఆలస్యమైంది. షూటింగ్ పూర్తి చేసి 2025 సంక్రాంతి బరిలో దించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలక రోల్స్ చేస్తున్నారు.

    ఎస్ జే సూర్య ప్రధాన విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుండగా, డబ్బింగ్ దశలో ఉందట. ఎస్ జే సూర్య తాను గేమ్ ఛేంజర్ మూవీకి డబ్బింగ్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అదే సమయంలో మూవీ ఎలా ఉంటుందో షార్ట్ రివ్యూ ఇచ్చాడు.

    హాయ్ ఫ్రెండ్స్, గేమ్ ఛేంజర్ మూవీలోని రెండు కీలక సన్నివేశాల డబ్బింగ్ నేను పూర్తి చేశాను. ఒకటి రామ్ చరణ్ తో మరొకటి శ్రీకాంత్ తో. నాకు మూడు రోజుల సమయం పట్టింది. అవుట్ ఫుట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. థియేటర్స్ లో ఈ సీన్స్ కి బీహార్ రెస్పాన్స్ రావడం ఖాయం. పోతారు అందరూ పోతారు. దర్శకుడు శంకర్, దిల్ రాజుకు ధన్యవాదాలు. సంక్రాంతికి రామ్ చరణ్ రాంపేజ్ చూస్తారు… అని ఎస్ జే సూర్య ట్వీట్ చేశాడు. గేమ్ ఛేంజర్ మూవీ అద్భుతంగా ఉంటుందని ఆయన షార్ట్ రివ్యూ ఇచ్చేశారు.

    ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 10న గేమ్ ఛేంజర్ విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.