Rain Alert Telugu States: ఏపీలో( Andhra Pradesh) వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న రెండు, మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ముందస్తుగా ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గత రెండు రోజులుగా వాతావరణం లో మార్పులు సంభవించాయి. ఎండ తీవ్రత తగ్గి మబ్బులు ఉన్నాయి. చాలా జిల్లాల్లో వర్షాలు కూడా బాగా నమోదవుతున్నాయి.
Also Read: Rain Alert: ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలెర్ట్
సముద్రమట్టానికి ఎత్తులో ఆవర్తనాలు బంగాళాఖాతంలో( Bay of Bengal) సముద్ర మొత్తానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 3.1, 7.6 కిలోమీటర్ల మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండు ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణకు సైతం వర్ష సూచన చేసింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని.. మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
ఏపీలో చాలా జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ఈరోజు పార్వతీపురం మన్యం ( parvatipuram manyam )జిల్లాలో మోస్తారు వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సైతం వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు పుంజుకోవడంతో ఆవర్తనాలు ఏర్పడేందుకు అనుకూల వాతావరణం కలిగింది. ఇకనుంచి బంగాళాఖాతంలో భారీగా తుఫాన్లు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
Also Read: Bay of Bengal Weather Alert: బంగాళాఖాతం నుంచి బిగ్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత!
ముందుగానే తాకిన రుతుపవనాలు..
ఈ ఏడాది ముందుగానే దేశానికి రుతుపవనాలు తాకాయి. అయితే ఒకవైపు రుతుపవనాలు ప్రవేశించగానే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. మహారాష్ట్రలో( Maharashtra) వర్షాలు విధ్వంసం సృష్టించాయి. మరోవైపు కర్ణాటకలో సైతం భారీగా వర్షాలు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే నైరుతి రుతుపవనాలు దేశాన్ని తాకడం విశేషం. వర్షపాతం నమోదులో నైరుతి రుతుపవనాలదే కీలక స్థానం. అటువంటి రుతుపవనాలు శరవేగంగా విస్తరించాయి.