Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలో చెదరుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్ని చోట్ల 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.