NTR Prashanth Neel Dragon Movie Update: ప్రస్తుతం నందమూరి అభిమానులు ఎన్టీఆర్(Junior NTR),ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళి తో పోటీ ని ఇచ్చే డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో ప్రశాంత్ నీల్ కచ్చితంగా ఉంటుంది. మరి అలాంటి డైరెక్టర్ తో ఎన్టీఆర్ లాంటి ఊర మాస్ హీరో సినిమా చేస్తే ఆ మాత్రం హైప్ ఉంటుంది కదా. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం వచ్చే నెల నుండి ఎన్టీఆర్ పూర్తి స్థాయి ప్రొమోషన్స్ లో హృతిక్ రోషన్ తో కలిసి పాల్గొనబోతున్నాడు.
అందుకోసం ఆయన ఇప్పటికే డేట్స్ కూడా కేటాయించేశాడట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన పై ఒక పాటని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత నెల నుండి రెండు నెలల వరకు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. తన పూర్తి సమయాన్ని ‘వార్ 2′(War2 Movie) ప్రొమోషన్స్ కోసం కేటాయించాలని చూస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మొట్టమొదటి సినిమా. ఇందులో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరో గా నటించగా,ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ని చూస్తుంటే పఠాన్ సినిమాని మళ్ళీ చూస్తున్నట్టుగా ఆడియన్స్ కి అనిపించింది. ఆ చిత్రం లో జాన్ అబ్రహం క్యారెక్టర్ కి ఎన్టీఆర్ క్యారక్టర్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి.
Also Read: NTR – Prashanth Neel : ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా..?
ఇకపోతే రీసెంట్ గానే ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసాడు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయట. అంతే కాదు వీళ్లిద్దరి మధ్య ‘నాటు నాటు’ రేంజ్ లో ఒక పాటని కూడా చిత్రీకరించారట. ఎన్టీఆర్ నెగెటివ్ క్యారెక్టర్ చేసినప్పటికీ అభిమానుల మనసు నొచ్చుకునే విధంగా ఆ క్యారక్టర్ ఉండదట, కచ్చితంగా అభిమానులు సంతృప్తి పడే విధంగానే ఆ క్యారక్టర్ ని మలిచాడట డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఇక ఈ చిత్ర లో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది. టీజర్ చూసినప్పుడు ఈమెకు, హృతిక్ రోషన్ మధ్య మధ్య ఒక డ్యూయెట్ సాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ కి హీరోయిన్ ఉందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.