https://oktelugu.com/

Deputy CM Pavankalyan  : పవన్’ బనేగా కరోడ్ పతి.. అమితాబ్ నోట ఏపీ డిప్యూటీ సీఎం మాట*

పవర్ స్టార్ పవన్ మేనియా గురించి ఎంత చెప్పినా తక్కువే.సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్టర్ అయ్యారు. ఏపీలోనే కాదు జాతీయస్థాయిలో సైతం గుర్తింపు సాధించారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 14, 2024 / 02:37 PM IST

    Deputy CM Pavankalyan

    Follow us on

    Deputy CM Pavankalyan : ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అద్భుత విజయం సాధించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయనకు విజయం వరించింది. 2014 ఎన్నికలకు ముందు జనసేనను ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు పలికారు. రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాయి. అయినా సరే జనసేన తరఫున ప్రజా సమస్యలపై పోరాడారు పవన్. 2019 ఎన్నికల్లోఒంటరి పోరాటం చేశారు.వామపక్షాలు,బీఎస్పీ తో కలిసి పోటీ చేశారు. ఓటమి తప్పలేదు. తాను పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారు. విశాఖలోని గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కు నిరాశ తప్పలేదు. దీంతో పవన్ ఎన్నో అవమానాలకు గురయ్యారు. ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. ఆయన వ్యక్తిగత జీవితం పై సైతంఎన్నెన్నో అభ్యంతరకర వ్యాఖ్యలు వచ్చాయి. అయినా సరే పట్టించుకోలేదు పవన్. నిత్యం ప్రజల మధ్య ఉన్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ఎన్నికల్లో టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి రావడానికి పవన్ ప్రధాన కారణం అయ్యారు. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసి 100% విజయంతో విక్టరీ కొట్టారు. తాను అనుకున్నది సాధించారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.

    * తనకంటూ ప్రత్యేకత
    తెలుగు సినీ పరిశ్రమలో పవన్ తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. లక్షలాదిమంది అభిమానుల మనసు దోచుకున్నారు. కానీ రాజకీయంగా మాత్రం తొలి రోజుల్లో సక్సెస్ పొందలేకపోయారు. ప్రజలు తిరస్కరించినా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయలేదు. వారిని ఒప్పించారు.. తన పనితీరుతో మెప్పించారు. ఫలితంగా ఎన్నికల్లో విజయం సాధించారు. దేశంలోనే సినీ రంగం నుంచి వచ్చిన ఓ హీరో అద్భుత విజయం సాధించేసరికి.. ఆ వర్గంలో సైతం ప్రత్యేక గుర్తింపు పొందారు పవన్.

    * జాతీయ స్థాయిలో సైతం
    జాతీయస్థాయిలో సైతం పవన్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన పవన్ కాదు తుఫాన్ అంటూ ప్రధాని మోదీ వర్ణించేసరికి.. దేశం యావత్తు పవన్ ను చూడడం ప్రారంభించింది. పవన్ రాజకీయ జీవితం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల సినీ పరిశ్రమలో పవన్ సాధించిన విజయంతో ఆ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. తమ వాడి విజయం గా చెప్పుకున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా.. అన్ని సినీ పరిశ్రమల్లో పవన్ హాట్ టాపిక్ గా మారారు.