Rajamouli-Mahesh Babu Movie : మహేష్ బాబు గత చిత్రం గుంటూరు కారం విడుదలై తొమ్మిది నెలలు అవుతుంది. ఆయన కొత్త చిత్రం పట్టాలెక్కలేదు. నెక్స్ట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. మహేష్ బాబు మేకోవర్ అవుతున్నారు. ఆయన లాంగ్ హెయిర్, గడ్డంలో రఫ్ అండ్ రస్టిక్ గా కనిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ మహేష్ బాబు పూర్తి స్థాయిలో గడ్డం పెంచింది లేదు. మహేష్ బాబు లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సదరు లుక్ లో సిల్వర్ స్క్రీన్ పై మహేష్ బాబును ఊహించుకుని గాల్లో తేలిపోతున్నారు.
అయితే రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29పై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. సాధారణంగా రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేయబోయే ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. గత రెండు మూడు నెలలుగా రాజమౌళి-మహేష్ బాబు మీడియా ముందుకు వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అసలు ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంత వరకు వచ్చాయనే సమాచారం కూడా లేదు. ఎస్ఎస్ఎంబి 29కి కథ సమకూరుస్తున్న రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ఓ కామెంట్ చేశాడు.
మే, జూన్ నెలల్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావచ్చని అన్నారు. సెప్టెంబర్ నెల వచ్చినా ఆ దిశగా అడుగులు పడలేదు. అయితే డిసెంబర్ నెలలో ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ప్రారంభం కావడం ఖాయం అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నవంబర్ నాటికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి డిసెంబర్ నుండి షూటింగ్ మొదలు పెట్టనున్నారట. ఇది మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో సందేహం లేదు.
ఎస్ఎస్ఎంబి 29 పాన్ వరల్డ్ మూవీ. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారట. సదరు సంస్థలతో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం. కాగా ఈ మూవీ జోనర్ పై రాజమౌళి ఆల్రెడీ హింట్ ఇచ్చారు. ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ఇండియానా జోన్స్ తరహాలో సాగే చిత్రం. మహేష్ బాబు పాత్ర సాహసవీరుడిగా ఉంటుందట.
వివిధ పరిశ్రమలకు చెందిన నటులు కీలక రోల్స్ చేయనున్నారట. హాలీవుడ్ నటులు సైతం నటించే అవకాశం కలదట. రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ చిత్రంతో మహేష్ బాబు ఇమేజ్ ఎల్లలు దాటేస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.