https://oktelugu.com/

Star Heroes: సినిమాల కోసం నాన్ వెజ్ ను మానేసిన స్టార్ హీరోలు వీరే..

షిరిడి సాయి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో సాయి బాబ పాత్రలో నటించారు నాగార్జున. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి అయ్యేవరకు ఎలాంటి మాంసాహారం తీసుకోలేదట నాగార్జున.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 18, 2024 / 02:50 PM IST

    Star Heroes

    Follow us on

    Star Heroes: నటన అంటే ప్రాణం. అదే వారి ప్రపంచంగా జీవిస్తారు కొందరు. పాత్రలో ఒదిగిపోయి మరీ జీవస్తారు. ఇలాంటి వారు సక్సెస్ కూడా సాధిస్తారు. అయితే పాత్ర డిమాండ్ చేసినట్టు వారు కూడా మోల్డ్ అవుతుంటారు. కొన్ని సార్లు పాత్ర కోసం బరువు పెరగడం, సన్నగా మారడం కూడా జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. దేవుళ్లకు సంబంధించిన సినిమాలు చేస్తున్నప్పుడు నాన్ వెజ్ కూడా తినరట. మరి సినిమాల కోసం నాన్ వెజ్ ను వదిలేసిన వారు ఎవరో ఓ సారి చూసేద్దాం.

    1..సీనియర్ ఎన్టీఆర్: దేవుళ్ల పాత్రలో నటించాలంటే ఒకప్పుడు అందరి ఛాయిస్ సీనియర్ ఎన్టీఆర్. ఈయన కెరీర్ లో చాలా పౌరాణిక పాత్రలు చేశారు. ఈయన నటించిన ఇలాంటి సినిమాల షూటింగ్స్ ప్రారంభం అయితే పూర్తయ్యేవరకు కూడా నాన్ వెజ్ తినేవారు కాదట.

    2. నాగార్జున: షిరిడి సాయి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో సాయి బాబ పాత్రలో నటించారు నాగార్జున. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి అయ్యేవరకు ఎలాంటి మాంసాహారం తీసుకోలేదట నాగార్జున.

    3.అల్లు అర్జున్: హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. ఈ మూవీలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా నటించారు. బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరని.. ఆ క్యారెక్టర్ లో నటించిన సమయంలో అల్లు అర్జున్ నాన్ వెజ్ తినలేదట. బ్రాహ్మణులను గౌరవిస్తూ అల్లు అర్జున్ ఈ పని చేశారట.

    4.పవన్ కళ్యాణ్: సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తారు. దీంతో సినిమా పూర్తయ్యేవరకు పవన్ కళ్యాణ్ నాన్ వెజ్ తినలేదట.

    5. రిషబ్ శెట్టి: కాంతార సినిమా సంచలన విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన కాంతార బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రిలీజ్ చేసిన అన్ని భాషల్లో శభాష్ అనిపించుకుంది. గూస్ బామ్స్ ను తెప్పించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. స్వీయ దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లారు. ఈ సినిమాలో కోలా సీక్వెన్స్ సినిమా కోసం హీరో రిషబ్ శెట్టి 20 నుంచి 30 రోజులు నాన్ వెజ్ తినలేదట.

    6..అక్షయ కుమార్: ఓ మై గాడ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా నాన్ వెజ్ తినడం లేదట. ఇందులో కృష్ణుడి పాత్రలో నటిస్తున్నారు అక్షయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ వెజ్ తినవద్దని చెప్పారట అక్షయ్ తల్లి. దీంతో నాన్ వెజ్ కు దూరం అయ్యారు అక్షయ్ కుమార్.

    7. పరిణీతి చోప్రా:
    బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి పరిచయం అవసరం లేదు. హిందీలో నటించినా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె పరిచయమే. ‘కోడ్ నేమ్ తిరంగ’ అనే మూవీలో నటించినప్పుడు ఆమె నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్నారట.

    మరి చూశారుగా కేవలం సినిమాలే అని వదిలేయకుండా దైవ భక్తితో ఈ స్టార్ హీరోలు, పరిణీతి చోప్రా నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారు. కొందరు ఒక రోజు ఉండాలని చెబితేనే కష్టపడతారు. అలాంటిది సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు నాన్ వెజ్ తినలేదంటే గ్రేట్ కదా..