Bajaj Pulsar
Bajaj Pulsar : భారత వినియోగదారుల్లో బజాజ్ టూ వీలర్లకు విశేషమైన ఆదరణ ఉంది. గత నెల అంటే ఫిబ్రవరిలో అమ్మకాలను పరిశీలిస్తే బజాజ్ పల్సర్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఫిబ్రవరిలో బజాజ్ పల్సర్‌ను మొత్తం 87,202 మంది కొత్త వినియోగదారులు కొనుగోలు చేశారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే బజాజ్ పల్సర్ అమ్మకాల్లో 21.90 శాతం క్షీణత కనిపించింది. అయినప్పటికీ, కంపెనీ మొత్తం అమ్మకాల్లో పల్సర్ వాటా ఒక్కటే 64.31 శాతంగా ఉంది. బజాజ్ పల్సర్ అనేక రకాల ఫీచర్స్ తో వస్తుంది. అవి మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఇది 4-స్ట్రోక్, 2-వాల్వ్, ట్విన్ స్పార్క్ BSVI కంప్లైంట్ DTS-i ఇంజిన్ (కొన్ని మోడళ్లలో ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంటుంది)తో వస్తుంది. మోడల్‌ను బట్టి 124.4సీసీ నుంచి 373.27సీసీ వరకు ఉంటుంది. ఇది 5-స్పీడ్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. ముందు డిస్క్ బ్రేక్ ప్రామాణికం, వెనుక డ్రమ్ లేదా డిస్క్ బ్రేక్ ఉంటుంది. అలాగే కొన్ని వేరియంట్‌లలో ABS కూడా ఉంటుంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.
Also Read : రేపు లాంచ్ కాబోతున్న బజాజ్ పల్సర్ ఎన్ 125.. ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ఫుల్ రివ్యూ ఇదీ
మోడల్‌ను బట్టి 11.5 లీటర్ల నుంచి 15 లీటర్ల వరకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్ అలాగే చాలా మోడళ్లలో డిజిటల్ కన్సోల్ ఉంటుంది. కొన్ని కొత్త మోడళ్లలో కాల్/SMS అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇతర ఫీచర్స్ ఉంటాయి. USB ఛార్జింగ్ పోర్ట్ కొన్ని మోడళ్లలో అందుబాటులో ఉంది. చాలా మోడళ్లలో LED టెయిల్ లైట్ ఉంటుంది. ఫిబ్రవరిలో కంపెనీ ఇతర మోడళ్ల అమ్మకాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.
27 శాతం తగ్గిన ప్లాటినా అమ్మకాలు
అమ్మకాల జాబితాలో రెండో స్థానంలో బజాజ్ చేతక్ నిలిచింది. బజాజ్ చేతక్ ఈ సమయంలో 57.27 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 21,420 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. ఇక మూడో స్థానంలో బజాజ్ ప్లాటినా ఉంది. బజాజ్ ప్లాటినా ఈ సమయంలో 27.14 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 20,923 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. నాల్గవ స్థానంలో బజాజ్ సిటీ నిలిచింది. బజాజ్ సిటీ ఈ సమయంలో 29.33 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 3,369 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది.
కేవలం 731 యూనిట్లు అమ్ముడైన బజాజ్ డొమినార్
మరోవైపు, అమ్మకాల జాబితాలో ఐదవ స్థానంలో బజాజ్ అవెంజర్ ఉంది. బజాజ్ అవెంజర్ ఈ సమయంలో 15.43 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 1,316 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఆ తర్వాత ఆరో స్థానంలో బజాజ్ ఫ్రీడమ్ ఉంది. బజాజ్ ఫ్రీడం ఈ సమయంలో 1,027 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఇక ఏడో స్థానంలో బజాజ్ డొమినార్ నిలిచింది. బజాజ్ డొమినార్ ఈ సమయంలో 4.73 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 731 యూనిట్ల మోటార్‌సైకిళ్లను మాత్రమే విక్రయించింది.
Also Read : బజాజ్ చేతక్ పై 92,982 కిలోమీటర్లు.. తల్లి కోసం ఓ వ్యక్తి సాహసం!