Property Registration: ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య రిజిస్ట్రేషన్ లను మరింత సరళతరం చేసింది. గ్రామ సచివాలయాల్లో నామమాత్రపు ఫీజుతో వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ కానున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నుంచి త్వరలో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రానున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులను అధిగమించేందుకు ఈ విధానం దోహదపడనుంది. రైతులతో పాటు సాధారణ ప్రజలు ఇబ్బందులు పలికే అవకాశం ఉండడంతో హర్షం వ్యక్తం అవుతోంది.
కార్యాలయాల చుట్టూ తిరగకుండా..
సాధారణంగా ఎటువంటి భూమినైన రిజిస్ట్రేషన్(Registration) చేసేందుకు సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నిర్దేశించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే రైతులతో పాటు సాధారణ ప్రజలు వ్యయ ప్రయాసలకు గురవుతుండడంతో కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్టార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ 10 లక్షల రూపాయల లోపు ఉంటే రూ.100, ఆ పైన ఉంటే రూ.1000 ఫీజును స్టాంప్ డ్యూటీ కింద తీసుకోనున్నారు. ఈ సౌకర్యం ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా మాత్రమే జరుగుతాయి.
Also Read: త్వరలో మరో 70 అన్న క్యాంటీన్లు.. ఎక్కడెక్కడంటే?
ఎన్నో రకాల ఇబ్బందులు..
సాధారణంగా తల్లిదండ్రులు( parents ) మరణించినప్పుడు వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు పొందేందుకు చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తహసిల్దార్ కు దరఖాస్తు చేసుకోవడానికి, మ్యూటేషన్ కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. గత ఏడాదిలో సుమారు 55 వేల ఫిర్యాదులు మ్యూటేషన్ ఆలస్యంపై ప్రభుత్వానికి వచ్చాయి. అందుకే ప్రభుత్వం ఈ తాజా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే సచివాలయాల ద్వారా మరణ ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. యజమాని మరణించిన అనంతరం ఆస్తులను వారసులు భాగాలుగా చేసుకుని లిఖితపూర్వకంగా.. ఏకాభిప్రాయంతో సచివాలయానికి వస్తే.. అక్కడ పని చేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్లు ఎలా చేయాలన్న దానిపై సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు కూడా మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు.
Also Read: టిడిపికి గవర్నర్ పోస్ట్.. చంద్రబాబు మనసులో ఆయనే!
ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం..
ఈ కొత్త విధానం ద్వారా భూముల రికార్డుల్లో వివరాల నమోదు ఆటోమేటిక్ గా(Automatic) జరిగిపోతుంది. వారసులకు ఈపాస్ బుక్ లు జారీ అవుతాయి. వారసులుగా ఉన్నవారి నుంచి ఈ కేవైసీ సైతం తీసుకుంటారు. అయితే చాలామంది తల్లిదండ్రులు చివరివరకు పిల్లల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయరు. వారి మరణంతో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. అయితే గత ఐదేళ్లలో వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలలోనే వారసత్వ సంక్రమణ భాగస్వామ్యానికి సంబంధించి ఈ కొత్త విధానానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో మార్గదర్శకాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.