Another 70 Anna canteens: కూటమి ప్రభుత్వం(Alliance government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ల పేరుతో పేద ప్రజల ఆకలిని తీర్చుతున్న సంగతి తెలిసిందే.రూ. 5 కే నాణ్యమైన భోజనం పెడుతోంది. పేద ప్రజల ఆకలిని తీర్చుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా మరో 70 క్యాంటీన్లు ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఉండేలా ప్లాన్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 113 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు మిగతా 62 నియోజకవర్గాల్లో కూడా వచ్చే జనవరి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం.
నగరాలు,పట్టణాల్లో
ప్రస్తుతానికి నగరాలతో పాటు ముఖ్య పట్టణాల్లో మాత్రమే క్యాంటీన్లు(canteens ) ఏర్పాటయ్యాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కొత్తగా 70 క్యాంటీన్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో సైతం అన్న క్యాంటీన్లు విస్తరించనున్నాయి. ఈ 70 కొత్త క్యాంటీన్లకు సంబంధించి భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ నాటికి వీటిని సిద్ధం చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. శరవేగంగా పనులు చేయిస్తున్నారు. కొన్నిచోట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి.
Also Read: టిడిపికి గవర్నర్ పోస్ట్.. చంద్రబాబు మనసులో ఆయనే!
రూ.61 లక్షలతో భవనం
అన్న క్యాంటీన్ కు సంబంధించిన భవన నిర్మాణ పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇందుకు గాను ప్రత్యేక నమూనాతో వాటిని రూపొందిస్తోంది. ఒక్కో క్యాంటీన్ భవనానికి రూ. 61 లక్షలు ఖర్చు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్లకు 42 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే కొత్తగా ఈ డబ్బా క్యాంటీన్లు ప్రారంభిస్తే ప్రభుత్వంపై ఏటా 45 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న 205 క్యాంటీన్లలో ప్రతిరోజు 1,84,500 మందికి ఆహారం అందిస్తున్నారు. ఒక్కొక్కరిపై మూడు పూటలా కలిపి రాయితీ కింద సుమారు 75 రూపాయలు ఖర్చు అవుతోంది. ఉదయం అల్పాహారం పై రూ.17, మధ్యాహ్నం భోజనం పై రూ.29, రాత్రి భోజనం పై మరో రూ.29 చొప్పున ఖర్చును ప్రభుత్వం భరిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Also Read: బాబు కొత్త పథకం.. సాయం పొందడానికి నిరుపేదలు రెడీ.. కానీ చేసే వారేరి?
జిల్లాల వారీగా కేటాయింపులు..
జిల్లాల వారీగా కొత్తగా మంజూరు అయ్యే క్యాంటీన్లు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam district) 5, పార్వతీపురం మన్యంలో ఒకటి, విజయనగరంలో మూడు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు, అనకాపల్లిలో 3, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు, తూర్పుగోదావరి జిల్లా నాలుగు, పశ్చిమగోదావరిలో మూడు, కాకినాడలో రెండు, ఏలూరులో నాలుగు, గుంటూరులో ఐదు, పల్నాడు లో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో ఒకటి, కృష్ణా జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో నాలుగు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూడు, తిరుపతిలో రెండు, చిత్తూరులో ఏడు, అనంతపురంలో 3, శ్రీ సత్య సాయి జిల్లాలో ఒకటి, కర్నూలులో నాలుగు, నంద్యాలలో ఒకటి, వైయస్సార్ కడప జిల్లాలో ఒకటి, అన్నమయ్య జిల్లాలో మూడు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు, అనంతపురం వంటి నగరాల్లో ఐదు నుంచి పది వరకు క్యాంటీన్లు ఉన్నాయి. అందుకే ఈసారి గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చారు.