Homeఆంధ్రప్రదేశ్‌Professor Nageshwar Vs TDP: ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ టిడిపి.. వైరం అక్కడ మొదలైంది

Professor Nageshwar Vs TDP: ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ టిడిపి.. వైరం అక్కడ మొదలైంది

Professor Nageshwar Vs TDP: టిడిపి మీద వైసిపికి ద్వేషం ఉంటుంది. భారత రాష్ట్ర సమితికి కూడా కోపం ఉంటుంది. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకు కచ్చితంగా విభేదాలు ఉంటాయి. దీనిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. తప్పు పట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ రాజకీయ పార్టీల మీద న్యూట్రల్ గా ఉండే విశ్లేషకులకు కోపం ఉండడమే ఇక్కడ అసలైన ఆశ్చర్యం.. ప్రభుత్వపరంగా.. పార్టీలపరంగా తప్పులు జరిగినప్పుడు విశ్లేషకులు వాటిని ఎత్తి చూపించాలి. అవసరమైతే వారు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చెప్పగలగాలి. ఇవి న్యూట్రల్ కోణంలోనే ఉండాలి. అలాకాకుండా వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా విమర్శలు చేస్తేనే విశ్లేషకుల అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన అసలైన రంగును టిడిపి విషయంలో బయటపెట్టుకున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలకు.. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించిన వ్యవహారం రాజకీయాలలో మంట పుట్టిస్తోంది.. దీనిని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తెలంగాణ, ఆంధ్ర వివాదంగా మార్చారు. దీనిని ఆసరాగా చూపించి కొంతమంది కావాలని భావోద్వేగాలు రెచ్చగొట్టి. వాటి ద్వారా చలికాచుకోవాలని భావిస్తున్నారు. వారు మాట్లాడిన మాటలు.. చేస్తున్న ప్రకటనలు విద్వేషాలను రగిలించే విధంగా ఉన్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు తప్పు.. వాటిని సమర్ధించుకోవడం ఇంకా తప్పు.. పైగా వాటికి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ పూయడం మరింత పెద్ద తప్పు..

అప్పట్లో వైసిపి పరిపాలన సాగుతున్నప్పుడు రాళ్ల మీద జగన్ తన బొమ్మలు వేసుకున్నాడు. దీనిని తప్పు అని టిడిపి నేతలు ప్రశ్నించారు. ఆ సమయంలో ఒక ఛానల్ లో డిబేట్ కు వెళ్లారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆ సమయంలో ఆయన ఉల్టా వాదించడం మొదలుపెట్టారు. కరోనా సమయంలో సర్టిఫికెట్ లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బొమ్మలు వేసుకున్నప్పుడు.. భూములకు పాతే రాళ్ల మీద జగన్ బొమ్మలు వేసుకుంటే తప్పు ఏంటి అని వాదించాడు. హద్దు రాళ్ల మీద బొమ్మలు.. కోవిడ్ సర్టిఫికెట్ మీద నరేంద్ర మోడీ ఫోటోలు ఒకే రకమైనవని ప్రొఫెసర్ నాగేశ్వర్ వాదించడం ఆయన మేధావితనానికి ఒక బలమైన నిదర్శనం. ఇంతకంటే ఎక్కువ దిగజారరు అనుకున్న ప్రతి సందర్భంలోనూ ఆయన దిగజారి నిరూపించుకుంటూనే ఉన్నారని టిడిపి నేతలు అంటున్నారు.

నాడు జగన్ బొమ్మల మీద మాట్లాడిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. దీనిపై ప్రొఫెసర్ నాగేశ్వర్ నారా లోకేష్ ను వ్యక్తిగతంగా కలిశారు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపాలని లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. దానికి లొకేషన్ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. అప్పట్నుంచి కడుపు మంటతో ప్రొఫెసర్ నాగేశ్వర్ రగిలిపోతున్నారు.. అందువల్లే టిడిపి మీద ఈ స్థాయిలో మండిపడుతున్నారు.

ప్రత్యేక హోదా కంటే పెట్టుబడులు.. కేంద్రం ద్వారా వచ్చే నిధుల కోసమే చంద్రబాబు, నారా లోకేష్ పాటు పడుతున్నారు. ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని.. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదని చంద్రబాబు.. లోకేష్ కు తెలుసు.. అందువల్లేవారు నిధుల కోసం.. పెట్టుబడుల కోసం తాపత్రయపడుతున్నారు.. అయితే ప్రత్యేక హోదా విషయాన్ని పదేపదే ప్రస్తావించి టిడిపిని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇబ్బంది పెడుతున్నారు.. అందువల్లే టిడిపి నాయకులు ఆయన మీద ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రైల్వే జోన్ విషయంలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు టిడిపికి ఇబ్బంది కలిగిస్తున్నాయి.. ఏపీకి రైల్వే జోన్ తెచ్చుకోవడం కష్టమైంది.. అది ఇచ్చిన సరే వేస్ట్ అని నాగేశ్వర్ అనడంతో టిడిపికి ఆ మాటలు ఇబ్బందికరంగా మారాయి. మరోవైపు పదేపదే కేంద్రాన్ని నిలదీయాలని టిడిపికి నాగేశ్వర్ పిలుపునివ్వడం.. దానిని వైసిపి నాయకులు తమ కొనుకూలంగా ప్రచారం చేసుకోవడం.. టిడిపిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటంతో..”దేశం” నాయకుల్లో ఆగ్రహం కలిగిస్తోంది.

తాజాగా నాగేశ్వర్ కు అనుకూలంగా హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ క్రాంతి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆవేశంగా మాట్లాడారు.. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేశారు..

“జనసేన అధినేతకు డెమోక్రసీ గురించి మాట్లాడే హక్కు లేదు. తెలంగాణ గురించి మాట్లాడే నైతికతలేదు. పూటకు ఒక రంగు మారుస్తాడు. చేగువేరా బొమ్మ పెట్టుకుని గద్దర్ వంటి నాయకుడిని మోసం చేస్తాడు. ఎన్టీఆర్ ను మోసం చేసి.. ఆయన చావు కారణమైన చంద్రబాబుకు సపోర్ట్ చేస్తాడు.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ జాగ్రత్త.. రజాకార్లను ఉరికించి కొట్టిన గడ్డ ఇది. మీ ఆస్తులు తగలబెట్టడమే కాదు.. మీ అస్తిత్వం కూడా లేకుండా చేస్తాం.. చంద్రబాబు హెరిటేజ్ ను నేటి నుంచి తెలంగాణలో లేకుండా నిషేధిస్తాం”.. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడిన మాటలు ఇవి.. ఇంకా చాలానే ఉన్నాయి.. ఇదంతా చూస్తుంటే ఓ పార్టీ మెప్పుకోసం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

కొంత మంది జనసేన కార్యకర్తలు కేసులు పెట్టారు. అవేవో ఆంధ్రా ప్రభుత్వం పెట్టినట్లు నాగేశ్వర్ చెప్పడం, తనకు అనుకూల మేధావులు తో కూడా చెప్పించడం, దాన్ని ఎదుర్కోడానికి తనేదో వీరోచిత పోరాటం చేస్తున్నాను అనడం, ప్రాణం పోయినా ప్రశ్నిస్తూనే ఉంటాను లాంటి సినిమా డైలాగ్స్ చెప్పడం…. ఇదంతా తనను తను ఎక్కువగా చేసుక9దానికి చేస్తున్న ప్రయత్నాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి.

అసలు అరెస్టుల ప్రస్తావన తీసుకొచ్చిందే నాగేశ్వర్. తన శిష్యులు ఎవరో చెప్పారని తను మొదలెడితేనే ఈ అల్లరి అంతా జరుగుతోంది. అస్సలు అటువంటిదేమీ లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చారు. దాన్ని నాగేశ్వర్, ఇతర మేధావులు, రాజకీయ నాయకులు అసలు పట్టించుకోవడం లేదు. అంతేకాదు వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఆవేశపూరిత స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇది ఒక వింత అయితే, వాటిని వారించే ప్రయత్నం నాగేశ్వర్ చేయకపోవడం ఇంకా వింతగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆయన చర్యలు, మాటలు వెనుక ఉద్దేశ్యాలు ఇంకేవో ఉన్నాయని అనుమానం వస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
AP Local Body Elections

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...
Oktelugu Epaper