Prakashraj : నటుడు ప్రకాష్ రాజ్ వెనక్కి తగ్గడం లేదు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ వ్యవహార శైలిని తప్పుపడుతూ వరుసగా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రకాష్ రాజ్. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.వైసిపి హయాంలో టీటీడీ లడ్డూను సైతం కల్తీ చేశారని.. నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని ఆరోపించారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేశంలో మతపరమైన వివాదాలు చాలావా అంటూ ప్రశ్నించారు.అధికారంలో ఉన్నది మీరే కదా..సమస్యకు పరిష్కార మార్గం చూపించవచ్చు కదా అని చెప్పుకొచ్చారు.దీనిపై పవన్ సైతం మరోసారి స్పందించారు.లడ్డు వివాదానికి ప్రకాష్ రాజుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని.. అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు ఈ వివాదం పై స్పందిస్తున్నారని నిలదీశారు పవన్. అక్కడ నుంచి ప్రకాష్ రాజ్ వరుసగా పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నారు. నీ ప్రతి మాటకు సమాధానం చెబుతానని కూడా చెప్పుకొస్తున్నారు. నేను చెప్పింది ఏంటి? మీరు అర్థం చేసుకుంది ఏంటని పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మీకు వీలైతే నా ట్విట్ మళ్లీ చదువుకోండి అంటూ సెటైర్ వేశారు. తమిళ హీరో కార్తీతో క్షమాపణలు చెప్పించుకున్న ఘటనపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. చేయని తప్పుకు క్షమాపణ చెప్పుకోవడం ఏంటి అని నిలదీశారు. అంతటితో ఆగకుండా గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటి అవాంతరం.. ఎందుకు మనకి అయోమయం.. ఏది నిజం? అంటూ ప్రకాష్ రాజ్ ట్విట్ చేశారు.
* ఒక్కోసారి ఒక్కోలా
అయితే లడ్డు వివాదం సుప్రీంకోర్టు పరిధిలో చేరిన సంగతి తెలిసిందే.తొలిసారి విచారణ సందర్భంగా చంద్రబాబుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.కోట్లాదిమంది భక్తుల మనోభావాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఆ క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ మరో ట్విట్ చేశారు. దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి.. హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ట్విట్ చేశారు ప్రకాష్ రాజ్. సనాతన ధర్మరక్షణలో మీరు ఉండండి.. సమాజ రక్షణలో మేముంటాం అని పవన్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* తగ్గని రగడ
తిరుపతి లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. లడ్డు వివాదంపై బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని కూడా ఆదేశించింది. కానీ అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మరోవైపు ఇలా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఎక్కడ ఎవరి పేర్లు ప్రస్తావన లేదు.