https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘ఇక డ్రామాలు ఆపేయ్’ అంటూ మణికంఠ కి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..ఇక అతనికి కేవలం 8 నిమిషాలే మిగిలిందా?

ముందుగా ఈ ప్రోమో లో నాగార్జున సీత తో మాట్లాడుతూ 'సీత..ఈ వారం నువ్వు తీసుకున్న నిర్ణయాలు మొత్తం సరైనవేనా?' అని అడగగా, దానికి సీత సమాధానం చెప్తూ 'విష్ణు ప్రియ ని, మణికంఠ ని నేనే నామినేట్ చేశాను సార్..వాళ్లకు ఒక చీఫ్ గా టాస్కులు ఆడే అవకాశం ఇవ్వాలని అనుకున్నాను, అందుకే నన్ను నేను త్యాగం చేసుకుందాం అనుకున్నాను' అని అంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 03:35 PM IST

    Bigg Boss Telugu 8(81)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ ప్రేక్షకులు వీకెండ్ ఎపిసోడ్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో మన అందరికీ తెలిసిందే. సాధారణంగా శనివారం ప్రసారమయ్యే ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్స్ శనివారం ఉదయం ప్రారంభిస్తారు. అదే రోజున ఆదివారం ఎపిసోడ్ కూడా షూట్ చేస్తారు. అందుకే ప్రోమోలు శనివారం రోజు చాలా ఆలస్యంగా విడుదల అవుతుంటాయి. కానీ ఈ శనివారం మాత్రం అప్పుడే రెండు ప్రోమోలు వచ్చేసాయి. కాసేపటి క్రితమే రెండవ ప్రోమో ని విడుదల చేయగా, అది యూట్యూబ్ లో తెగ వైరల్ గా మారిపోయింది. ముందుగా ఈ ప్రోమో లో నాగార్జున సీత తో మాట్లాడుతూ ‘సీత..ఈ వారం నువ్వు తీసుకున్న నిర్ణయాలు మొత్తం సరైనవేనా?’ అని అడగగా, దానికి సీత సమాధానం చెప్తూ ‘విష్ణు ప్రియ ని, మణికంఠ ని నేనే నామినేట్ చేశాను సార్..వాళ్లకు ఒక చీఫ్ గా టాస్కులు ఆడే అవకాశం ఇవ్వాలని అనుకున్నాను, అందుకే నన్ను నేను త్యాగం చేసుకుందాం అనుకున్నాను’ అని అంటుంది.

    ఇక తర్వాత నాగార్జున పృథ్వీ ఆట తీరుని మెచ్చుకుంటాడు. మొదటి రెండు వారాలు చాలా కోపం తో ఆటలు ఆడేవాడిని, నోరు కంట్రోల్ చేసుకోమన్నాను, నేను చెప్పింది చెప్పినట్టు చేసావ్, ఆటలో నీ దమ్ము చూపించావు అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. అలాగే నైనిక కి నాగార్జున చేతిలో బాగా కోటింగ్ పడింది. చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ అన్నావు, బ్లాస్ట్ ఎక్కడా? అని అడుగుతాడు. ఏదైనా టాస్కు ఇస్తే నేను బాగా ఆడుతాను సార్ అని నైనిక సమాధానం చెప్తుంది. అప్పుడు నాగార్జున మొదటి వారంలో నాకు కనపడిన నైనిక ఇప్పుడు కనిపించడం లేదు అని చెప్తాడు నాగార్జున. ఇక ఆ తర్వాత మణికంఠ తో మాట్లాడుతూ ‘మణికంఠ నీతో మాట్లాడాలి..ఇప్పుడు మాట్లాడుకుందామా?, తర్వాత మాట్లాడుకుందామా?’ అని అడుగుతాడు నాగార్జున. నాకు ఎప్పుడు మాట్లాడిన ఓకే సార్ అని మణికంఠ చెప్పడంతో ‘సీత బాడీ లాంగ్వేజ్ తో నీకొచ్చిన సమస్య ఏమిటి?’ అని నాగార్జున అడగగా, తను నన్ను వెక్కిరించినట్టుగా అనిపించింది సార్ అంటాడు మణికంఠ. మధ్యలో సీత కలగచేసుకొని నాగార్జున తో మాట్లాడుతూ ‘మణికంఠ చాలా డ్రామాలు ఆడుతున్నాడు. నాకెందుకో హౌస్ లో అతను మమ్మల్ని కార్నెర్ చేస్తున్నట్టుగా అనిపించింది’ అని అంటుంది. ఇక ఆ తర్వాత మణికంఠ ని నాగార్జున యాక్షన్ రూమ్ కి పిలుస్తాడు.

    ఒక టేబుల్ మీద రెండు మూడు బండిల్స్ టిష్యూ పేపర్స్ ఉంటాయి. నీకు 8 నిమిషాలు సమయం ఇస్తున్నాను, ఎంత ఏడుస్తావో ఏడ్చేయ్ అని అంటాడు నాగార్జున. నాకు ఇప్పుడు పెద్దగా ఏడుపు రావట్లేదు సార్ అని అంటాడు మణికంఠ, దానికి నాగార్జున మాట్లాడుతూ ‘ఒకవేళ నీ భార్య ప్రియ నీతో మాట్లాడుతూ, కన్నా నువ్వు అక్కడే ఉండు, ఇక్కడికి రాకు అంటే ఏమి చేస్తావు?’ అని నాగార్జున అడగగానే, నాకు ఏడుపు వస్తుంది సార్ అని అంటాడు మణికంఠ..ఏడవడమే నీ స్ట్రాటజీ అయితే ఇక నుండి అది వర్కౌట్ అవ్వదు, ఈ డ్రామాలు ఆపేయ్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు, ఆ తర్వాత ఏమి జరిగింది అనేది నేటి ఎపిసోడ్ లో చూడాలి.