Bread fruit: బ్రెడ్ ఫ్రూట్ ఒక్కసారి తింటే.. జీవితాంతం ఆరోగ్యం!

ఎక్కువ శాతం మంది వీటిని తినడానికే ఇష్టపడతారు. ఆరోగ్యంగా ఉండటానికి పండ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. డైలీ వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

Written By: Kusuma Aggunna, Updated On : October 5, 2024 2:28 pm

Bread-fruit

Follow us on

Bread fruit: మనకి తెలియని పండ్లు చాలానే ఉన్నాయి. అందరికీ ఎక్కువగా అరటి, జామ, ఆరెంజ్, దానిమ్మ, ఆపిల్, ద్రాక్ష వంటి పండ్లు బాగా తెలుసు. ఎక్కువ శాతం మంది వీటిని తినడానికే ఇష్టపడతారు. ఆరోగ్యంగా ఉండటానికి పండ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. డైలీ వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. పండ్లను తినడం వల్ల యంగ్‌గా ఉండటంతో పాటు ఫిట్‌గా కూడా ఉంటారు. అయితే మనలో చాలామందికి బ్రెడ్ ఫ్రూట్ గురించి పెద్దగా తెలియదు. బ్రెడ్ ఫ్రూట్ అంటే బ్రెడ్‌తో తయారు చేస్తారని అసలు అనుకోవద్దు. ఇది కూడా ఒక రకమైన ఫ్రూట్. చాలా అరుదుగా దొరికే ఈ పండులో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. దీని రుచి కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు బ్రెడ్‌ను కాల్చుకుని తింటే ఏ టేస్ట్ అనిపిస్తుందో ఈ బ్రెడ్ ఫూట్ టేస్ట్ కూడా ఇలానే ఉంటుంది. ఈ పండు మొదటిగా దక్షిణ ఫసిఫిక దీవుల్లో దర్శనమిచ్చింది. ఈ పండు ఎక్కువగా వేడిగా ఉండే ప్రాంతాల్లో పండుతుంది. అయితే కొందరు ఈ పండును బంగాళదుంపతో కూడా పోలుస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండును తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మరి తెలుసుకోవాలంటే ఆర్టికల్ మొత్తం చదివేయండి.

కేరళ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలలో లభించే ఈ పండులో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. వీటిని రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పండు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. 100 గ్రాముల బ్రెడ్‌ఫ్రూట్‌లో 90 కేలరీలు, 2.5 గ్రాముల ప్రొటీన్, 3.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా ఈ పండును తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్ సి గుండె సమస్యలు రాకుండా చేయడంలో సాయపడుతుంది. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజుకి కనీసం చిన్న ముక్క తిన్న చాలు. ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.

బ్రెడ్‌ఫ్రూట్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. ఈ పండులో ఫైబర్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే పీచు మలబద్దకాన్ని నయం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అలాగే పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే ఈ పండును మోతాదులో మాత్రమే తినాలి. అధికంగాజ తింటే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో బాగా సహాయపడతుంది. అందుకే దీనిని సూపర్ ఫ్రూట్, పవర్ ఫ్రూట్ అని కూడా అంటారు. చాలా అరుదుగా దొరికే ఆ పండును అసలు వదలవద్దు. ఒక్కసారి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.