https://oktelugu.com/

Prakash Raj: పవన్ నీడలా వెంటాడుతున్న ప్రకాష్ రాజ్.. తాజాగా సంచలన ట్వీట్!

Prakash Raj తిరుమలలో లడ్డు వివాదం నాటి నుంచి పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నారు ప్రకాష్ రాజ్( actor Prakash Raj ). నాడు లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.

Written By: , Updated On : April 3, 2025 / 06:11 PM IST
Prakash Raj

Prakash Raj

Follow us on

Prakash Raj: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై( deputy CM Pawan Kalyan) ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆది నుంచి పవన్ కళ్యాణ్ విషయంలో విభేదిస్తూ వచ్చారు ప్రకాష్ రాజ్. నిత్యం సోషల్ మీడియా వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రశ్నిస్తూనే ఉన్నారు ప్రకాష్ రాజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ జాతీయ అవార్డులు, రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్.. అధికారంలోకి వచ్చాక వాటి గురించి పెద్దగా పట్టించుకోవడంలేదని తప్పుపట్టారు. అధికారంలో ఉండి కూడా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా టైంపాస్ పనులేంటి అంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. మాటలు మార్చడానికి ఇదే సినిమా కాదని కూడా సెటైరికల్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Also Read: కంచ గచ్చిబౌలి భూముల ఫోటో.. ఫోటోగ్రాఫర్ కు కాంగ్రెస్ నేత బంపర్ ఆఫర్!

* లడ్డూ వివాదం నుంచి మొదలు..
తిరుమలలో లడ్డు వివాదం నాటి నుంచి పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నారు ప్రకాష్ రాజ్( actor Prakash Raj ). నాడు లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అది చాలా సున్నితమైన అంశమని.. భక్తుల మనోభావాలకు సంబంధించినదని అప్పట్లో చెప్పారు ప్రకాష్ రాజ్. ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. నిజంగా లడ్డూ తయారీలో కల్తీ జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాష్రాజ్ అప్పట్లో కోరారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇటీవల త్రి భాషా విధానంపై పవన్ మాట్లాడినప్పుడు సైతం ప్రకాష్ రాజ్ స్పందించారు.

* త్రీ భాషా విధానం పై కామెంట్స్..
తాజాగా జనసేన ఆవిర్భావ సమయంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 భాషా విధానంపై పవన్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కొందరు హిందీ భాషపై గగ్గోలు పెడుతున్నారు అంటూ పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై( Tamil Nadu CM Stalin ) విమర్శలు చేశారు పవన్. హిందీ భాషా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దానిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం.. ఇంకో భాషను ద్వేషించడం కాదని.. స్వాభిమానంతో తమ మాతృభాషను, తమ తల్లిని కాపాడుకోవడమేనని పవన్ కళ్యాణ్ కు ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ముగించారు ప్రకాష్ రాజ్.

* డిప్యూటీ సీఎం అంటూ గుర్తు చేసిన వైనం..
అప్పట్లో తిరుమల లడ్డు వివాదాన్ని జాతీయ సమస్యగా మార్చవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ప్రకాష్ రాజ్. ముందుగా దోషులను కనుగొని వారిని శిక్షించాలని సూచించారు. మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది. దయచేసి దర్యాప్తు చేయండి. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి అని ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే మాదిరిగా మరోసారి విరుచుకుపడ్డారు ప్రకాష్ రాజ్. నిత్యం పవన్ కళ్యాణ్ నీడలా వెంటాడుతున్నారు. రాజకీయాన్ని వేడి పుట్టిస్తున్నారు.