RCB Fan: ప్రతి మ్యాచ్ కూడా అభిమానులకు వీనులవిందైన క్రికెట్ ఆనందాన్ని అందిస్తోంది. సీట్ ఎడ్జ్ ఉత్కంఠను కలిగిస్తోంది. ఆదివారాలు రెండు మ్యాచ్లు.. మిగతా వారాల్లో ఒక మ్యాచ్ ను ఐపీఎల్ నిర్వాహ కమిటీ నిర్వహిస్తోంది. సాయంత్రమైతే చాలు యువత, క్రికెట్ అభిమానులు టీవీలకు, స్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోతున్నారు. తమ అభిమాన జట్టు ఆటగాళ్లు ఆడుతుంటే.. వికెట్లు పడగొడుతుంటే ఎగిరి గంతులు వేస్తున్నారు. ప్రస్తుత ఐపిఎల్ లో టైటిల్ ఫేవరెట్ గా చాలా జట్లు ఉన్నాయి. అందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కూడా ఉంది. బెంగళూరు జట్టుకు రజత్ పాటిదర్ (Rajat Patidar) నాయకత్వం వహిస్తున్నాడు.. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ కీలక ఆటగాడిగా ఉన్నాడు. గతంలో బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించినప్పటికీ.. ఆ జట్టు ఐపిఎల్ ట్రోఫీ దక్కించుకోలేకపోయింది.. ఐపీఎల్ ఇప్పటివరకు 17 సీజన్లు పూర్తయినప్పటికీ ఇంతవరకు బెంగళూరు విజేతగా నిలవలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఫైనల్ దాకా వెళ్ళినప్పటికీ.. బెంగళూరు ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించలేకపోయింది.
గొర్రెపోతును కోస్తా.. డిన్నర్ ఇస్తా..
విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక ఐపీఎల్ సమయంలో అయితే బెంగళూరు అభిమానులు విరాట్ కోహ్లీ అంటే చాలు ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. కన్నడ అభిమానులు మాత్రమే కాదు.. తెలుగువారు కూడా విరాట్ కోహ్లీని విపరీతంగా అభిమానిస్తారు. విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు.. బెంగళూరు జట్టు ఓడిపోయినప్పుడు వారు తట్టుకోలేరు. తమ బాధను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ ఉంటారు. అలా సోషల్ మీడియాలో మాట్లాడిన బాల అభిమాని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చకు దారి తీస్తోంది. ఆ బాలుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన గొర్రెలను చూపించుకుంటూ..” హాయ్ ఫ్రెండ్స్.. విరాట్ కోహ్లీ అవుట్ కావద్దని కోరుకోండి ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ ని అవుట్ అని ప్రకటించకుండా అంపైర్ కు గొర్రెపోతుని ఇస్తాను. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిస్తే గొర్రెపోతుని కోసి డిన్నర్ ఇస్తాను” అంటూ ఆ బాలుడు తన స్వీయ వీడియోలో ప్రకటించాడు. ఆ వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ” విరాట్ భయ్యా నువ్వు ఇతడి కోసమైనా గొప్పగా ఆడాలి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను గెలిపించాలి. ఈసారి విజేతగా నిలిచేలా చేయాలి. ఇలాంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒకవేళ నువ్వు గనుక బెంగళూరు జట్టును ఛాంపియన్ గా మాకు గొర్రెపోతుతో ఇతడు డిన్నర్ ఇస్తా అంటున్నాడు. దానికోసమైనా నువ్వు దూకుడుగా ఆడాలి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఈసారైనా విజేతగా నిలపాలని..” నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Ee sala cup namde thammudu
Dinner ki ready ga undu…#RCB pic.twitter.com/0CtFbIEFiF— Arehoo_official (@tweetsbyaravind) April 2, 2025