Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. సడన్ గా అనంతపురం పోలీసులు హైదరాబాదులో ఎంట్రీ ఇచ్చారు. అర్థరాత్రి పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. అయితే దీనిని ఖండిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏపీవ్యాప్తంగా ఉన్న నేతలు పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ అని ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం స్పందించారు. కృష్ణ మురళి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. న్యాయ పరంగా కూడా చేయూతనందిస్తామని కూడా చెప్పుకొచ్చారు. పోసాని కృష్ణ మురళి భార్య కుసుమలతకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.
Also Read: వర్మ బదులు వంగవీటి రాధా.. దేవినేని కి గ్రీన్ సిగ్నల్.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వారే!
అయితే పోసాని కృష్ణ మురళి అరెస్టు తీరును చెబుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు భార్య కుసుమలత( kusumalatha ). అర్ధరాత్రి అన్యాయంగా తన భర్తను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ఇంట్లోకి పోలీసులు వచ్చారని వెల్లడించారు. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారని.. ఇంట్లోకి వచ్చి రచ్చ రచ్చ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పోలీసులు వినలేదని.. బలవంతంగా అరెస్టు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పోలీసులు( వచ్చి రాగానే పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారని.. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రేపు వస్తామని చెప్పిన వినలేదని వాపోయారు. తన భర్త ఫోన్ తో పాటు తన ఫోన్ సైతం లాగేసుకున్నారని చెప్పుకొచ్చారు. నేరుగా బెడ్ రూమ్ లోకి వచ్చి అల్లరి చేశారని.. అసౌకర్యానికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హడావిడిగా బలవంతంగా తన భర్తను ఎత్తుకెళ్లారని.. ఆయన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదని ఫైరయ్యారు. ఏపీ ప్రభుత్వం తన భర్త అరెస్ట్ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: పోసాని అరెస్ట్.. రంగంలోకి జగన్.. ప్రచార అస్త్రంగా ఆ సామాజిక వర్గం