PM Narendra Modi: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టనున్నారు. మే 2న శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన విడుదలైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పది నెలలపాటు అమరావతిని యధా స్థానానికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. ఒకవైపు నిధుల సమీకరణ చేస్తూనే.. ఇంకోవైపు జంగిల్ క్లియరెన్స్, టెండర్ల ఖరారు వంటి వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అవన్నీ కొలిక్కి రావడంతో ఇప్పుడు ప్రధానితో శంకుస్థాపన చేసేందుకు సిద్ధపడింది.
Also Read: అనూహ్యంగా ఊహించని నేతకు బిజెపి పగ్గాలు!
* ఇలా చేరుకుంటారు..
మే 2న ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) ఢిల్లీ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు రాజధాని పనుల పున ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రధాని. మోడీ హాజరయ్యే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం భారీ బహిరంగ సభకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరావతి సచివాలయం వెనుక భాగంలో బహిరంగ సభ వేదికను ఎంపిక చేశారు. అక్కడ నుంచి అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
* ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
అమరావతి రాజధాని పున ప్రారంభ కార్యక్రమానికి ప్రధానమంత్రి వస్తుండడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి ప్రకాశం( Prakasam district ),గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి బహిరంగ సభకు భారీగా జనాలను తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటినుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. పది రోజుల వ్యవధి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం జన సమీకరణకు వ్యూహాలు రూపొందిస్తోంది. అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. రాష్ట్ర ప్రజలకు అమరావతి వేదికగా ప్రత్యేక పిలుపు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం ఐదు లక్షల మంది ప్రజలు హాజరవుతారని.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
* నోడల్ అధికారిగా వీరపాండ్యన్
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు నోడల్ అధికారిగా వీర పాండ్యన్( Veerapandian ) ఉన్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ను కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి వెళ్లడానికి తొమ్మిది రోడ్లను గుర్తించారు. వాస్తవానికి ఎటువంటి హంగామా లేకుండా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని తొలుతా భావించారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అయింది. అందుకే సీఎం చంద్రబాబు విన్నపం చేసిందే తడువు ప్రధాని మోదీ ఒప్పుకున్నారు. అమరావతి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వెనువెంటనే షెడ్యూల్ సైతం ఖరారు చేశారు.
Also Read: