Prajagalam: చిలకలూరి సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ మాట్లాడుతుండగా ప్రధాని మోడీ కలుగజేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. చిలకలూరిపేట సమీపంలో టిడిపి బిజెపి జనసేన సంయుక్తంగా ప్రజా గళం బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసుకున్నారు. సీఎం జగన్ తీరును ఎండగట్టారు. సభకు లక్షలాదిమంది జనాలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం కనుచూపు మేరలో కూడా జనాలే కనిపించారు. కొందరైతే నాయకులను చూసేందుకు లైట్స్ టవర్స్ కూడా ఎక్కేశారు.
జనసేన అధినేత పవన్ మాట్లాడుతుండగా పెద్ద ఎత్తున యువత కేరింతలు కొట్టారు. కొందరు విద్యుత్ లైట్లకు సంబంధించి టవర్లు ఎక్కారు. దీంతో ఒక్కసారిగా ప్రధాని మోదీ కలుగజేసుకున్నారు. తాను కూర్చున్న ప్లేస్ నుంచి లేచి వచ్చి పవన్ ప్రసంగం మధ్యలో కల్పించుకున్నారు. మైక్ వద్దకు వచ్చి అందరూ కిందకు దిగాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.’ ప్రాణాలు పోతాయి. అందరూ కిందకు దిగాలని వేడుకుంటున్నాను’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్ వీడి మరి మైక్ వద్దకు వచ్చి చెప్పారు ప్రధాని. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. టవర్స్ ఎక్కిన జనాలను కిందకు దించారు. ప్రధాని తీరుతో సబికులతో పాటు జనాలు సైతం ఆశ్చర్యపోయారు. మోడీని పొగడ్తలతో ముంచెత్తారు.
అయితే ప్రధాని మోదీ ఇలా సమయస్ఫూర్తిగా స్పందించడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇదేవిధంగా ప్రవర్తించారు. అటు తన కాన్వాయ్ ని పక్కన పెట్టి మరి అత్యవసర సమయాల్లో అంబులెన్సులకు దారి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రధాని ముందుంటారు. అయితే ఈ సభలో మాత్రం పవన్ మాట్లాడుతుండగా ప్రధాని ఒక్కసారిగా కలుగజేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి తానే ప్రజలకు స్వయంగా విజ్ఞప్తి చేయడం ఆకట్టుకుంది.