https://oktelugu.com/

Child Care Tips: పిల్లలకు ఏ నూనెలు రాస్తున్నారు? జాగ్రత్త

జొజొబా ఆయిల్ పిల్ల చర్మాన్ని కాపాడి పోషకాలను అందిస్తుంది. ఆర్గాన్ ఆయిల్స లో విటమిన్స్, ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి పిల్లలకు పోషకాలను అందిస్తుంది. బాదంనూనె కూడా పిల్లలకు చాలా మంచిది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 17, 2024 / 06:15 PM IST

    Child Care Tips

    Follow us on

    Child Care Tips: పిల్లల జుట్టుకు చాలా జాగ్రత్త వహించాల్సిందే. వారి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లులు కొన్ని టిప్స్, కొన్ని ప్రత్యేకమైన నూనెలు వాడాల్సిందే. తలకు రాసే నూనెల దగ్గర నుంచి షాంపూల వరకు జాగ్రత్తగా ఎంచుకోవాలి. మరి ఎలాంటి నూనెలను వాడాలో తెలుసుకుందామా….ఇప్పుడు తెలుసుకోబోయే నూనెల్లో ఫ్యాటీ యాసిడ్, విటమిన్ ఇ లు ఉంటాయి. ఇవి పిల్లల జుట్టుకు పోషణను అందించి.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

    ఆముదం నూనెలో కండీషనింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె వల్ల పిల్లల జుట్టుకు తేమ అందుతుంది. గ్రేప్ సీడ్ ఆయిల్ లో ఫ్యాట్ అసలే ఉండకపోగా.. తేలిగ్గా కూడా ఉంటుంది. ఈ లక్షణం వల్ల చర్మంలోకి ఇంకుతుంది. అందుకే ఈ నూనెను స్కాల్ప్ పై అప్లై చేసి మసాజ్ చేయాలి. అవకాడో, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల పిల్లల స్కాల్ప్ పై మాయిశ్చరైజేషన్ అంది తొందరగా పెరుగుతుంది. ఇక ఇదే విధంగా జొజొబా ఆయిల్ కూడా చాలా మంచిది అంటారు నిపుణులు.

    జొజొబా ఆయిల్ పిల్ల చర్మాన్ని కాపాడి పోషకాలను అందిస్తుంది. ఆర్గాన్ ఆయిల్స లో విటమిన్స్, ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి పిల్లలకు పోషకాలను అందిస్తుంది. బాదంనూనె కూడా పిల్లలకు చాలా మంచిది. ఇందులో విటమిన్ ఇ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్ గా ఉంటాయి. దీన్ని అప్లై చేయడం వల్ల పిల్లల జుట్టుకు పోషణ అందడం మాత్రమే కాదు మెరుపు కూడా వస్తుంది. అంతేకాదు చక్కగా పెరుగుతుంది కూడా. ఆలివ్ ఆయిల్ లో కూడా చక్కని గుణాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా వాడవచ్చు.

    పొడి చర్మాన్ని హైడ్రేట్ చేసే గుణం ఉన్న ఆలివ్ వల్ల స్కాల్ప్ హైడ్రేట్ గా ఉంటుంది. ఇక కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల పిల్లల సున్నితమైన చర్మం బాగుంటుంది. అయితే షాపుల్లో ఖరీదు చేసిన కొబ్బరినూనె కంటే స్వఛ్చమైన కొబ్బరి నూనెను వాడాలి అని గుర్తు పెట్టుకోండి.