PM Modi Amaravati Visit: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణానికి సంబంధించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి శ్రీకారం చుట్టనున్నారు. అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజధాని గ్రామాల ప్రజలు పండగలా భావిస్తున్నారు. లక్షలాదిమంది తరలివచ్చే ఈ కార్యక్రమానికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోంది. పనుల పునః ప్రారంభోత్సవ వేల రాజధాని ప్రాంతం సరికొత్త కాంతులతో వెలుగొందుతోంది. అమరావతిలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. సభకు దాదాపు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఆంధ్రుల కల సాకారం కాబోతున్న వేళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. దానిపైనే చర్చ నడుస్తోంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు దాదాపు లక్ష కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
Also Read: నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి అర్ధం అయ్యేది కాదు : పవన్ కళ్యాణ్
* హోం మంత్రి నేతృత్వంలో.. తిరువనంతపురం( Thiruvananthapuram) పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలిక్యాప్టర్లో అమరావతి చేరుకుంటారు. ఇప్పటికే నాలుగు హెలికాప్టర్లు విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గంలో వెళ్లేలా రెండు మార్గాలను ఎంపిక చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సభ జరిగే ప్రాంతానికి.. ఐదు కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్ గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్ ఎగురవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఇవే నిబంధనలు అమలు అవుతాయి.
*అమరావతి ప్రాంత రైతుల ఆనందం
.
మరోవైపు అమరావతి( Amravati ) ప్రాంత రైతులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవం నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రైతులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని మోడీ సభకు భారీగా జనాలు రావాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుందన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజల తరఫున మరోసారి కృతజ్ఞతా పూర్వక స్వాగతం పలుకుతున్నట్లు ట్వీట్ చేశారు.
* పవన్ ఆసక్తికర ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan ) అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్న వేళ ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఈరోజు రాష్ట్రానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక స్వాగతం. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని మీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అంటూ పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Also Read: మతం మారితే.. ఎస్సీ హోదా కోల్పోయినట్లే.. హైకోర్టు కీలక తీర్పు