Lokesh Kanagaraj : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్స్ క్యాటగిరీలో సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిన వ్యక్తి లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj). ఇతను సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇతనికి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. అలాంటి సమయంలో సందీప్ కిషన్ ‘నగరం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్ళలేదు కానీ, ఎవరో డైరెక్టర్ చాలా బాగా తీసాడు, మంచి విషయం ఉంది అని ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్పుకొచ్చారు. కొంతకాలం గ్యాప్ తర్వాత లోకేష్ కనకరాజ్ తమిళ హీరో కార్తీ తో ‘ఖైదీ’ అనే చిత్రం ద్వారా మన ముందుకొచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read : నెల్సన్ vs లోకేష్ కనకరాజ్ ఈ ఇద్దరిలో ఎన్టీఆర్ తో సినిమా చేసేది ఎవరు..?
ఈ చిత్రం తర్వాత ఆయన విజయ్ తో చేసిన ‘మాస్టర్’, కమల్ హాసన్ తో చేసిన ‘విక్రమ్’, మళ్ళీ విజయ్ తో చేసిన ‘లియో’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు రేపాయి. ఈ సినిమాలతో ఆయన రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ వంటి దిగ్గజ దర్శకుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన ‘కూలీ’ చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ ‘ఖైదీ 2’ చేయబోతున్నాడు. ఆ తర్వాత సూర్య తో ‘రోలెక్స్’, కమల్ హాసన్ తో ‘విక్రమ్ 2’ వంటి చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి అవ్వడానికి కనీసం మూడేళ్ళ సమయం పడుతుంది.
వీటితో పాటు లోకేష్ కనకరాజ్ మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ హీరోలైన ప్రభాస్ తో, రామ్ చరణ్ తో కూడా సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. ప్రభాస్, హోమబుల్ సంస్థ కాంబినేషన్ లో ఒక సినిమా రానుంది. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఖరారు అయ్యాడు. అయితే ఈ ప్రాజెక్ట్ రాబోయే మూడేళ్ళలో సెట్స్ పైకి ఎక్కే అవకాశం కనిపించడం లేదు. మరో పక్క ప్రభాస్ లైనప్ మరో ఆరేళ్ళు ఫుల్ బిజీ గా ఉండేట్టు ఉంది. ఈలోపు రామ్ చరణ్ తో సినిమా చేస్తాడా అంటే అనుమానమే. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుంది. సుకుమార్ తో సినిమా అంటే ప్రారంభం అవ్వడం వరకే రామ్ చరణ్ చేతుల్లో ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు ముగుస్తుంది అనేది సుకుమార్ కి కూడా తెలియదు. కాబట్టి లోకేష్ కనకరాజ్ ఇప్పట్లో మన తెలుగు హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు.
Also Read : ఇక సెలవు అంటూ రజినీకాంత్ ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్!