Pawan Kalyan: రాష్ట్రవ్యాప్తంగా మేడే ఉత్సవాలు( MayDay celebrations ) ఘనంగా జరిగాయి. కార్మికులు ఘనంగా జరుపుకున్నారు తమ పండగని. అయితే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ మేడే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్లో ఉపాధి కార్మికులతో పవన్ ఆత్మీయ భేటీ నిర్వహించారు. ముఖ్యంగా యూపీఏ హయాంలో అమల్లోకి వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం పై పవన్ ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో ఆ పథకం ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న మేలును కూడా వివరించారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రానికి కాకుండా దేశానికి గొప్ప వరం అని పవన్ పేర్కొన్నారు. మరోవైపు తన చదువు గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్.
Also Read: అమరావతిలో ప్రధాని సభకు జగన్.. కీలక నిర్ణయం!
* మరోసారి చదువు ప్రస్తావన..
తన చదువు విషయంలో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) స్పష్టతనిచ్చేవారు. చిన్నప్పటినుంచి తనకు చదువు అవ్వలేదని చెప్పడానికి సిగ్గుపడేవారు కాదు. ఈరోజు కూడా అటువంటి కామెంట్స్ చేశారు. తాను రెగ్యులర్ చదువులు చదువుకోలేదని చెప్పారు. అందుకే ఏ ఉద్యోగం చేయాలో అర్థం అయ్యేది కాదన్నారు. తనకు చెమట చిందించి పనిచేయడం ఇష్టం అని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు బెంగళూరులో ఒక నర్సరీలో పని చేయడం కోసం వెళ్తుంటే కుటుంబ సభ్యులు ఆపిన విషయాన్ని ప్రస్తావించారు. కేవలం ఒక డాక్టర్, ఇంజనీర్, సైంటిస్టులు మాత్రమే గొప్ప వాళ్ళు కాదన్నారు. కష్టపడి పని చేసే ప్రతి కార్మికుడు గొప్పవాడేనని చెప్పుకొచ్చారు.
* ఉపాధి హామీ పథకం వరం..
మరోవైపు పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ కూలీల పేరును.. ఉపాధి శ్రామికులు గా మార్చిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని ఈరోజు కూడా చెప్పుకున్నారు. ఇకనుంచి ఉపాధి శ్రామికులు అని పిలవాలని పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రం తో పాటు దేశానికి ఉపాధి హామీ పథకం వెన్నుదన్నుగా నిలిచిన విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. 75 లక్షల 23,000 మంది శ్రామికులకు సొంత గ్రామాల్లోని ఉపాధి దక్కుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో రూ.10600 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. మెటీరియల్ కాంపోనెంట్ కింద నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే.. వేతనాలకి 6000 కోట్ల రూపాయలకు పైగా అందించినట్లు గుర్తు చేశారు.
* ఉపాధి శ్రామికులు గా పిలుద్దాం..
ఇకనుంచి ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలుద్దాం అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మిగతా వృత్తుల్లో ఉన్న వారిలాగే ఉపాధి శ్రామికులు కూడా గొప్పవారేనని చెప్పుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో ఏపీ అప్పుల పాలయిందని.. మధ్య నిషేధం అంటూ వచ్చి గత ప్రభుత్వం వ్యాపారం చేసిందని చెప్పుకొచ్చారు. 3200 కోట్ల రూపాయలు మద్యం ద్వారా పక్కదారి పట్టించారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయ్యాయని చెప్పారు.
నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి నాకు ఏ ఉద్యోగం చేయాలో అర్ధం అయ్యేది కాదు : పవన్ కళ్యాణ్
నాకు చెమట చిందించి పనిచేయడం ఇష్టం
చిన్నప్పుడు బెంగళూరులో ఒక నర్సరీలో పని చేయడం కోసం వెళ్తుంటే మావాళ్లు నన్ను ఆపారు
కేవలం ఒక డాక్టర్, ఇంజనీర్, సైంటిస్టులు మాత్రమే గొప్ప వాళ్ళు… pic.twitter.com/OxmH9KRg7V
— BIG TV Breaking News (@bigtvtelugu) May 1, 2025