Pithapuram MLA Taluka: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవడంతో ఒక స్లోగన్ బలంగా వినిపించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పవన్ గెలవడంతో… అభిమానులు ముద్దుగా బంధుత్వాన్ని కలుపుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ తమ వాహనాలపై, నంబర్ ప్లేట్లపై రాసుకుంటున్నారు. అటువంటివి వద్దని పవన్ వారించినా ఇప్పటికీ కొంతమంది అదే స్లోగన్ ను అతికిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల కిందట పిఠాపురంలో పర్యటించారు పవన్. ఈ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ప్రచారంపై స్పందించారు. దయచేసి అలా ఎవరూ రాసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చెడ్డ పేరు తీసుకురావద్దని కూడా కోరారు.
అయితే పవన్ అంత పిలుపు ఇచ్చినా.. స్పష్టమైన ప్రకటన చేసినా చాలామంది అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. తాజాగా ఓ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇద్దరు యువకులు స్కూటీపై నెంబర్ ప్లేట్ బదులు.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాసుకొచ్చారు. పోలీసులు ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అభిమానం ఉంటే మనసులో దాచుకోవాలని.. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. మొదటి తప్పిదంగా భావించి విడిచి పెడుతున్నామని.. మరోసారి ఇటువంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించి విడిచిపెట్టారు. ఇదే విషయాన్ని రెండు రోజుల కిందట పిఠాపురంలో స్పష్టం చేశారు పవన్.
వాహనానికి ఒరిజినల్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారంటూ పవన్ హెచ్చరించారు. నన్ను కూడా తిడతారని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ చట్టాలను పాటించాలని.. రూల్స్ ను బ్రేక్ చేయడానికి వీలు లేదని కూడా పలికారు. అయితే ఒక్క పిఠాపురం ప్రాంతంలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దేశంలో గాని నడుస్తోంది. ఈ ఎన్నికల్లో హోరాహోరీ ఫైట్ నడిచింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడిస్తామని వైసిపి నేతలు ప్రకటించారు. ఈ తరుణంలో జనసైనికులు ఆ విమర్శలను తిప్పి కొట్టారు. ఈ క్రమంలోనే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్న స్లోగన్ బయటపడింది. పవన్ అత్యధిక మెజారిటీతో పిఠాపురం నుంచి గెలవడంతో జనసైనికులు అదేపనిగా ఈ బోర్డులు పెడుతుండడం విశేషం.
ఈ పిల్ల సైనిక్స్ ట్విట్టర్లో మోరేగేది తప్ప పికేది ఏం లేదు
పిఠాపురం ఎమ్మెల్యే తాలూక అంట బొచ్చేమి కాదు pic.twitter.com/5XxTEMZrUE
— (@2029YSJ) July 6, 2024