Rajamouli Biopic: ఎన్నో విశేషాల దర్శక ధీరుడు రాజమౌళి బయోపిక్.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Rajamouli Biopic: 2001లో ఎన్టీఆర్ హీరోగా విడుదలైన స్టూడెంట్ నెంబర్ వన్ ఆయన మొదటి చిత్రం. ఇది ఎన్టీఆర్ కి రెండో చిత్రం కావడం విశేషం. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో రాజమౌళి హిట్ కొట్టాడు.

Written By: S Reddy, Updated On : July 6, 2024 1:09 pm

SS Rajamouli Bidopic documentary Modern Masters

Follow us on

Rajamouli Biopic: దర్శకుడు రాజమౌళి అరుదైన గౌరవం అందుకున్నారు. ఆయన జీవితం తెర రూపం పొందింది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రాజమౌళి బయోపిక్ ప్రసారం కానుంది. రాజమౌళి బయోపిక్ స్ట్రీమింగ్ డేట్, డిజిటల్ పార్ట్నర్ పై అధికారిక ప్రకటన వెలువడింది. టాలీవుడ్ లో రాజమౌళి ప్రస్థానం మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగిన రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్ అయ్యారు. సినిమా దర్శకుడు కాకముందు రాజమౌళి సీరియల్స్ డైరెక్టర్ చేశారు.

2001లో ఎన్టీఆర్ హీరోగా విడుదలైన స్టూడెంట్ నెంబర్ వన్ ఆయన మొదటి చిత్రం. ఇది ఎన్టీఆర్ కి రెండో చిత్రం కావడం విశేషం. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో రాజమౌళి హిట్ కొట్టాడు. రెండో చిత్రం సింహాద్రి తో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. సింహాద్రి ఎన్టీఆర్ కి మొదటి ఇండస్ట్రీ హిట్. పాతికేళ్ల కెరీర్లో రాజమౌళి తెరకెక్కించింది 12 చిత్రాలు మాత్రమే. ఇంత వరకు ఆయనకు పరాజయం అంటే తెలియదు.

బాహుబలి, బహుబలి 2తో ఇండియన్ సినిమా ముఖ చిత్రం మార్చేశాడు రాజమౌళి. వెయ్యి కోట్ల వసూళ్లు సాధ్యమని నిరూపించి చూపాడు. మూవీలో కంటెంట్ ఉంటే ఈ భాషా బేధం లేకుండా ఆదరిస్తారని రుజువు చేశాడు. తెలుగు సినిమాకు వంద కోట్ల మార్కెట్ గగనమైన రోజుల్లో రాజమౌళి సాహసం చేసి వందల కోట్ల బడ్జెట్ తో బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు తెరకెక్కించారు. ఇప్పటికీ బాహుబలి 2 రికార్డ్స్ అనేకం బ్రేక్ కాలేదు.

ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆస్కార్ కొల్లగొట్టి ఎవరికీ అందనంత ఎత్తుకు రాజమౌళి వెళ్లారు. రాజమౌళి ఘనమైన సినీ ప్రస్థానాన్ని బయోపిక్ రూపంలో తీసుకొచ్చారు. మోడరన్ మాస్టర్స్ పేరుతో ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 5 నుండి నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. రాజమౌళి బయోపిక్ లో ప్రపంచ సినిమాపై రాజమౌళి ప్రభావం, జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి దిగ్గజాలు రాజమౌళి గురించి చేసిన కామెంట్స్ చూపించనున్నారు. రానా, ప్రభాస్, ఎన్టీఆర్ కూడా డాక్యుమెంటరీలో కనిపిస్తారని సమాచారం.