Rushikonda Palace: జనం సొమ్ముతో జగన్ జల్సా..రుషికొండ నిర్మాణాలు చూస్తే మైండ్ బ్లాక్

జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది. ఏకంగా 452 కోట్లతో విలాసవంతమైన భవనాలు కట్టారు. వాటిలో ఏకంగా 12 బెడ్ రూములు నిర్మించారు. ప్

Written By: Dharma, Updated On : June 17, 2024 8:25 am

Rushikonda Palace

Follow us on

Rushikonda Palace: మూడు భారీ భవనాలు.. 12 బెడ్ రూమ్ లు.. అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, రెండు సెంట్లు విస్తీర్ణంలో బాత్రూంలు, ఏ వస్తువు పట్టుకున్న లక్షలాది రూపాయలు.. ఇది పేదల ప్రతినిధిగా చెప్పుకునే పెత్తందారీ భవనం. విశాఖ తీరాన రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్ లు బహుళ ప్రపంచంలోకి వచ్చాయి. గత ఐదేళ్లుగా పెత్తందారీ వ్యవస్థతో పోరాడుతున్నానని జగన్ చెప్పుకొచ్చారు. కానీ వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రాజసౌధం చూస్తే జగన్ ఆలోచన ఏంటన్నది ఇట్టే తెలిసిపోతుంది. తనకోసం రాజభవనాలను తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ లు కొట్టుకోవడం.. దానిని గుట్టుగా సాగించడం.. ఇప్పుడు అధికార మార్పిడితో వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది. ఏకంగా 452 కోట్లతో విలాసవంతమైన భవనాలు కట్టారు. వాటిలో ఏకంగా 12 బెడ్ రూములు నిర్మించారు. ప్రతి బెడ్ రూమ్ కు ఒక అటాచ్ బాత్రూంను నిర్మించారు. ఆ బాత్రూం లో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రతి నిర్మాణం ప్రత్యేకత సంతరించుకున్నదే. దాని వైశాల్యం 480 చదరపు అడుగులు. అంటే పేదలకు జగన్ ఇచ్చిన ఇంటి స్థలం కంటే అధికం. ప్యాలెస్ లో ప్రతి అడుగు రాజసం ఉట్టిపడేలా ఖరీదైన నిర్మాణాలు చేపట్టారు.

ఋషికొండపై భవనాలకు 452 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే 407 కోట్లు ఖర్చు పెట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ను కూడా తెచ్చారు. మళ్లీ తానే గెలుస్తానని.. 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్ కలలుగన్నారు. రాజధానిని విశాఖకు మార్చేసి రిషికొండపై కొలువు తీరాలన్నది జగన్ లక్ష్యం. గతంలో నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారు. జగన్ నివాసంతో పాటు సీఎం కార్యాలయం కోసం ఈ భవంతులను కట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే హాలీవుడ్ నటులు కొన్ని మిలియన్ డాలర్లు వెచ్చించి కొట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాలను తలదన్నేలా వీటిని నిర్మించారు.

ప్రభుత్వ రాజధాని అవసరాల కోసం వీటిని నిర్మాణం చేపడుతున్న కొందరు మంత్రులు మాత్రం రిసార్టు లేనని బుకాయించారు. అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రుషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించేలా నాటకం ఆడారు. విశాఖలో మిగతా భవనాలను పరిశీలించి అన్నింటికీ రిషికొండ భవనాలు ఆమోదయోగ్యమని గ్రామ పండించారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి సేవలను వినియోగించుకున్నారు. ఆ కమిటీకి నేతృత్వం వహించే ఆమె చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ భవనాలు సీఎం నివాసంతో పాటు కార్యాలయానికి వినియోగించుకోవచ్చని సూచించారు. కానీ వారు ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది. వైసిపి ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ పేదల సీఎం చేపట్టిన నిర్మాణాలు బయటకు వచ్చాయి.

వైసిపి అధికారంలో ఉన్నన్నాళ్లు అటువైపుగా చీమకు కూడా ప్రవేశం లేకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందలాది మంది పోలీసులను మొహరించి అడ్డుకుంది. తాజాగా మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిడిపి నాయకుల బృందం, మీడియా ప్రతినిధులను తీసుకుని ఆదివారం రుషికొండ భవనాలను సందర్శించారు. దీంతో విలాసవంతమైన భవనాల వ్యవహారం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇదే ఏపీలో వైరల్ అంశంగా మారింది. ప్రజల్లో బలమైన చర్చ నడుస్తోంది. ఇన్ని రోజులు రహస్యంగా సాగిన నిర్మాణ ప్రక్రియ వెలుగులోకి రావడంతో వైసీపీ శ్రేణులు కూడా ఒకరకమైన ఆందోళన కనిపిస్తోంది. ఎప్పటికీ జగన్ కు బెంగళూరు, హైదరాబాదు, పులివెందుల, తాడేపల్లిలో రాజభవనాలను తలదన్నే భవంతులు ఉన్నాయి. అవి చాలా ఉన్నట్టు ఇప్పుడు రిషికొండపై పడ్డారు. అయితే జగన్ ఆడిన డ్రామాలో ఐదారు గురు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ క్యాబినెట్ అనుమతి తీసుకున్నారు.