Yadadri Temple: సాధారణంగా గుడికి వెళ్లిన వారు ముందుగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆలయంలోపలికి వెళ్తారు. తాము దర్శించే దేవస్థానం ఉన్న క్షేత్రానికంతటికీ ప్రదక్షిణ చేయటం సంప్రదాయం. కానీ స్వామి వారు కొలువైన ఆ ప్రదేశం కొండ ప్రాంతమైతే.. ఆ కొండ మొత్తం ప్రదక్షిణ చేసే సాంప్రదాయం అరుణాచలంలోనే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలోని యాదాద్రిలో గరి ప్రదర్శనను ప్రవేశపెట్టనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
గిరి ప్రదక్షిణ అనగానే మనకు గుర్తుకువచ్చేది అరుణాచలం. ఇక్కడ స్వయంభుగా వెలిసిన పరమ శివుడిని 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేసి దర్శించుకోవడం ఏళ్లుగా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఎండా, వాన, చలిని లెక్క చేయకుండా భక్తులు రాత్రి పగలు గిరి ప్రదర్శన చేస్తూనే ఉంటారు. అరుణాచల గిరి ప్రదర్శన చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ ప్రదక్షిణలు చేసేవారు ఏదైనా పండ్లను తీసుకెళ్లాలని అంటారు. తిరుపతికి వెళ్లిన వారు అరుణాచలంను తప్పక దర్శిస్తుంటారు.
ఇక ఇలాంటి గిరి ప్రదక్షిణను యాదాద్రిలో నిర్వహించేందుకు అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరిగుట్ట కొండపై జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ వారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు స్వయంభువులుగా వెలసిన పంచ నారసింహక్షేతంగా ఎంతో ప్రసిద్ధి చెందిది. ఎన్నో ఏళ్లుగా స్థానిక భక్తులు మాత్రమే గిరిప్రదక్షిణ చేసుకొని స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతోంది.
2016 నుంచి అలయాన్ని కోట్లాది రూపాయలతో పునర్నిర్మించారు. ఈ దివ్యక్షణాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికీ తీసిపోని రీతిలో తీర్చిదిద్దారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులకు ఇబ్బందికరంగా మారింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే యాదగిరిగుట్టలో ఉన్న పాత ఆచారాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో బాగానే కొండపై స్వామివారి సన్నిధిలో భక్తులకు బస చేసే అవకాశం కల్పించింది. అలాగే కొండపైకి అటోలను అనుమతించడం వంటి అంశాలను పునరుద్ధరించింది.
తాజాగా గిరి ప్రదక్షిణకు అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి చుట్టూ 5 కిలోమీటర్ల వరకు గిరి ప్రదక్షిణ ఉండనుంది. జూన్ 18న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో తెలంగాణలో మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ చేపట్టిన మొదటి ఆలయంగా నిలవనుంది.