Gold Price Today: బంగారం ధరలు నిన్న పెరగగా ఈరోజు స్థిరంగా కొనసాగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గింది. దేశీయంగా సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 17న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,550 గా ఉంది. జూన్ 16న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర ఆదివారంతో పోలిస్తే సోమవారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,700గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,650 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,550 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,050 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,150తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,550తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,650తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,550తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు స్థిరంగా ఉన్నా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.90,900గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం రూ.100 తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.90,900గా ఉంది. ముంబైలో రూ.90,900, చెన్నైలో రూ.95,500 బెంగుళూరులో 91,200, హైదరాబాద్ లో రూ. 95,500 తో విక్రయిస్తున్నారు.