Pensions: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం కొలువుతీరి రేపటితో ఏడాది అవుతుంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి సర్కార్ పింఛన్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించిన పింఛన్లు అందించేందుకు సిద్ధమయింది. ఇప్పటికే ఈ పింఛన్లకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. వీరికి పింఛన్లు ఇచ్చేందుకు సైతం నిధులు విడుదల చేసింది. సచివాలయాల్లోనూ ఈ కొత్త కేటగిరి పెన్షన్ల వివరాలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 11 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోంది ప్రభుత్వం. అయితే గత కొన్నేళ్లుగా పింఛన్ లబ్ధిదారుడుగా ఉన్న భర్త చనిపోతే భార్యలకు పింఛన్ ఇవ్వలేదు. కానీ వేలమంది ఇలా అర్హత ఉన్నా పింఛన్ దక్కించుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మందికి రేపు పింఛన్లు అందించనుంది కూటమి ప్రభుత్వం. ఎందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటికి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో వీరందరికీ పింఛన్లు అందించనుంది.
* వైసిపి హయాంలో నిర్లక్ష్యం..
గత కొన్నేళ్లుగా పింఛన్( pension) తీసుకుంటున్న లబ్ధిదారులు చనిపోయారు. అలా చనిపోయిన భార్యలకు వితంతు పింఛన్ అందించాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 71380 మంది లబ్ధిదారులు పెన్షన్ అందకుండా ఉన్నారు. వీరందరినీ గుర్తించింది కూటమి ప్రభుత్వం. వీరికి రేపు పెన్షన్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకుగాను రూ.29.60 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. దీంతో వీరికి సచివాలయ ఉద్యోగులు రేపు పింఛన్ అందించనున్నారు.
* ఇక్కడి నుంచి నిరంతరం
అయితే ఈ తరహా కేటగిరి పింఛన్ల పంపిణీ ప్రక్రియను నిరంతరాయంగా జరపాలన్నది కూటమి ప్రభుత్వ( Alliance government ) నిర్ణయం. ఒకవేళ పెన్షన్ లబ్ధిదారుడుగా ఉంటూ.. భర్త చనిపోతే ఆయన మరణ ధ్రువీకరణ పత్రం అందిస్తే ఈ కేటగిరిలో చేర్చి.. భార్యలకు తరువాత నెల నుంచి పెన్షన్ అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో రాష్ట్రంలో ఇలా ఇబ్బందులు పడుతున్న 71 వేల మందికి పైగా లబ్ధిదారులు రేపు పెన్షన్ అందుకోనున్నారు. మీరు జీవించినంత కాలం పెన్షన్ కొనసాగబోతోంది. దీంతో ఆయా వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.