Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan praises Lokesh : కలిసి ఉంటే కలదు సుఖం.. లోకేష్ పై పవన్...

Pawan Kalyan praises Lokesh : కలిసి ఉంటే కలదు సుఖం.. లోకేష్ పై పవన్ అలా!

Pawan Kalyan praises Lokesh : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది అవుతోంది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టిడిపి నేతృత్వంలోని కూటమి ఘనవిజయం సాధించింది. 164 అసెంబ్లీ సీట్లతో ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, మంత్రిగా లోకేష్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ముగ్గురు నేతలు కూటమిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులు రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వాటన్నింటికి చెక్ చెబుతూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చూపిస్తున్న చొరవ అంతా ఇంతా కాదు. వీరి మధ్య ఉన్న బంధం రోజురోజుకు బలపడుతోంది. రాజకీయ ప్రత్యర్థులకు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. తాజాగా అటువంటి ఘటనే ఈరోజు సచివాలయంలో కనిపించింది.

Also Read : పళ్ళు కొరుకుతున్నావేంటి.. మీదికి వస్తున్నావేంటి.. పోలీసులు వర్సెస్ అంబటి రాంబాబు.. వైరల్ వీడియో

* పవన్ అభినందనలు
మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) అభినందనలతో ముంచెత్తారు. ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ను మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కలిశారు. యువగళం పాదయాత్రకు సంబంధించి ఫోటో ఆల్బంను, ప్రత్యేకంగా ఆవిష్కరించిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ కు అందించారు. వాటిని చూసిన పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా లోకేష్ చేసిన పాదయాత్రను గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ప్రజలతో మమేకమై లోకేష్ పాదయాత్ర చేశారని.. కూటమి అధికారంలోకి వచ్చేందుకు యువగళం పాదయాత్ర ఎంతగానో దోహద పడిందని పవన్ అభినందించారు. పవన్ అభినందనలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

* నాటి నుంచి ఎనలేని గౌరవం..
నాడు చంద్రబాబు( CM Chandrababu) జైల్లో ఉన్నప్పుడు నేరుగా అక్కడకు వచ్చి పరామర్శించారు పవన్ కళ్యాణ్. నారా లోకేష్ ని జైలు బయటకు తెచ్చి.. మీడియా ముందు మాట్లాడుతూ టిడిపి తో జనసేన పొత్తును ఖరారు చేశారు. నాడు నేనున్నాను అంటూ లోకేష్ తో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. అప్పటినుంచి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ విషయంలో గౌరవభావంతో ముందుకెళ్తున్నారు. పవన్ అన్న అంటూ సోదర సమానంగా చూస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేశారు. పవన్ వద్దని వారించినా లోకేష్ మాత్రం వినలేదు. పాదానికి చేతితో తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే పవన్ తో లోకేష్ కు వివాదం వస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. కానీ ఆ ఇద్దరు నేతలు తమ మధ్య ఉన్న బంధాన్ని మరింత దృఢం చేసుకుని ముందుకు సాగుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు.

* ఒకరికొకరు అన్నట్టు
వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party ) బలమైన నేపథ్యం ఉంది. 40% ఓటు బ్యాంకు ఉంది. అది పవన్ కళ్యాణ్ కు తెలియంది కాదు. ప్రస్తుతం టిడిపి వ్యవహారాలను చూస్తోంది లోకేష్. అటు ఆ పార్టీ శ్రేణులు సైతం లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నాయి. ఈ విధంగా చెప్పాలంటే పార్టీ పరంగా లోకేష్ ఇప్పుడు బలంగా ఉన్నారు. కానీ కష్టకాలంలో పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఆపై ప్రత్యేక ఆకర్షణ కలిగిన నేతగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో జనసేనకు ఓటు బ్యాంక్ అయితే ఉంది. కానీ టిడిపి తో పోల్చుకుంటే ఆ పార్టీ బలం మాత్రం చాలా తక్కువ. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పొత్తు ఒకటి రెండు చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా.. పవన్, లోకేష్ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తాము సమ

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version