Kannappa vs Harihara Veeramallu : జూన్ 12 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్దమైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల మరోసారి వాయిదా పడిన సంగతి మన అందరికీ తెలిసిందే. నిన్న ఉదయం ఈ వార్త సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో ఒక్కసారిగా ఫ్యాన్స్ కుప్పకూలిపోయారు. జూన్ 12 న థియేటర్స్ లో ఎంతో ఘనంగా ఈ సినిమాని సెలెబ్రేట్ చేసుకోవాలని అభిమానులు ప్లానింగ్ చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక విడుదల కాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో కనీవినీ ఎరుగని రీతిలో సంబరాలు చేయాలనీ నిర్ణయించుకున్నారు. కానీ VFX వర్క్స్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో, సమయానికి అవి డెలివరీ కాకపోవడంతో మేకర్స్ వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 26 న విడుదల చేయాలని చూస్తున్నారు. కానీ ఈ సినిమా విడుదలైన పక్క రోజునే ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం విడుదల కాబోతుంది. అయితే మేకర్స్ ‘కన్నప్ప’ టీం ని కలిసి వాయిదా వేసుకోవాల్సిందిగా కోరారట. కానీ ఆ మూవీ ససేమేరా ఒప్పుకోలేదని తెలుస్తుంది. తాము ఈ సినిమా విడుదల తేదీని మూడు నెలల క్రితమే ప్రకటించామని. చిన్న సినిమా అయితే తప్పుకునేవాళ్లమని, కానీ మేము కూడా ఈ చిత్రానికి దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఖర్చు చేశామని, బయ్యర్స్ ని కూడా అన్ని ప్రాంతాలకు సిద్ధం చేసుకున్నామని, ఇలాంటి సమయం లో వాయిదా వేస్తే చాలా నష్టపోతామని చెప్తున్నారట. ఆలోచిస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా అని పవన్ అభిమానులు కూడా అంటున్నారు. పోనీ జూన్ 20 న విడుదల చేద్దామని అనుకుంటే ఆరోజున కుబేర చిత్రం రాబోతుంది.
Also Read : ప్రభాస్ కోసమే కన్నప్ప చూస్తారా..? ఆయన స్క్రీన్ టైమ్ ఎంతంటే..?
రీసెంట్ గానే చెన్నై లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. సెన్సార్ కి కూడా షెడ్యూల్ చేసుకున్నారు. పైగా నిర్మాత సునీల్ నారంగ్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య ఈమధ్య థియేటర్స్ విషయం లో కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ తేదీన కూడా విడుదల చేయలేరు. ఈ రెండు తేదీలలో కాకుండా జులై 4న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ అదే రోజున విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా వాయిదా పడింది, మళ్ళీ వాయిదా వేస్తే నష్టాలు తప్పవని నిర్మాత నాగవంశీ దయచేసి ఆ తేదీన రావొద్దు అంటూ ‘హరి హర వీరమల్లు’ నిర్మాత AM రత్నం ని రిక్వెస్ట్ చేసాడట. పైగా ఆ తేదీ ‘హరి హర వీరమల్లు’ కి సరైనది కూడా కాదు. ఎందుకంటే ఓవర్సీస్ లో అనేక హోలీవూడ్ మూవీస్ ఆ తేదీన విడుదల కాబోతున్నాయి. దీంతో ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ చిత్రం జులై 18 కి లాక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.