spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Kavuri Sambasiva Rao Health: కేంద్ర మాజీ మంత్రికి తీవ్ర అస్వస్థత!

Kavuri Sambasiva Rao Health: కేంద్ర మాజీ మంత్రికి తీవ్ర అస్వస్థత!

Kavuri Sambasiva Rao Health: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ( sambasiva Rao) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. నిన్ననే మంత్రి నారా లోకేష్ ఆయనను పరామర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈరోజు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కావూరి సాంబశివరావు సీనియర్ పొలిటీషియన్. ఐదు సార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఒకసారి కేంద్రమంత్రి పదవి చేపట్టారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కావూరి సాంబశివరావుకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు.

Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి

* సుదీర్ఘకాలం ఎంపీగా..
ఉత్తమ వ్యాపారిగా పేరు తెచ్చుకున్నారు కావూరి సాంబశివరావు. 1943 అక్టోబర్ 2న జన్మించారు. కాంగ్రెస్( Congress) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1984, 1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో జోలీ శాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన కావూరి సాంబశివరావు.. 2014 రాష్ట్ర విభజనతో బిజెపిలో చేరారు. అటు తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు.

* విశాఖ ఎంపీ శ్రీ భరత్ తాత..
కావూరి సాంబశివరావు వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు కావూరి. కావూరి సాంబశివరావుకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంత్రి నారా లోకేష్ నిన్ననే కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ స్వయానా కావూరి సాంబశివరావు మనవడు. ఆయన కుమార్తె కుమారుడు. అందుకే నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. కావూరి సాంబశివరావు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Oktelugu Epaper
Exit mobile version