Prabhas Raja Saab Scene : బాహుబలి (Bahubali) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో ప్రభాస్ (Prabhas)…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా పాన్ ఇండియాలో తనను స్టార్ హీరోగా ఎలివేట్ చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల కోసం బాలీవుడ్ జనాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తే చాలు ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందంటూ సగటు ప్రేక్షకులందరూ అతని సినిమాల మీద మంచి కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేయడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ప్రభాస్ నుంచి వచ్చే సినిమాల విషయంలో అతని అభిమానులైతే పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఆయన చేసిన సలార్(Salaar), కల్కి (Kalki) సినిమాలు భారీ విజయాలుగా నిలవడమే కాకుండా వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలన్నింటిలో ఈ సినిమాలు సాధించిన విజయాలు పెను సంచలనాలను క్రియేట్ చేయడమే కాకుండా తన నుంచి రాబోయే సినిమాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పాయి.
ప్రస్తుతం ఆయన మారుతి (Maruthi) డైరెక్షన్ లో చేస్తున్న ‘రాజాసాబ్’ (Rajasaab) సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యం లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read : అసలు ‘రాజా సాబ్’ కి ఏమైంది..? ప్రభాస్ ఎందుకు అంత ఫైర్ అవుతున్నాడు!
అందులో ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో ఒక ఐదు నిమిషాల పాటు గే క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి తను కావాలనే ఈ సినిమాలో అలా కనిపించి కొందరిని బురిడీ కొట్టించే ప్రయత్నం అయితే చేయబోతున్నాడట. ఇప్పటివరకు ఆయన ఇలాంటి పాత్రనైతే చేయలేదు.
మరి అలాంటి పాత్రలో చేయాల్సి వస్తే తన అభిమానులు అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయం మీదనే ఇప్పుడు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మొత్తానికైతే నటుడు అనే వాడు అన్ని రకాల పాత్రలను పోషించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభాస్ దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని చాలా అద్భుతంగా నటించి మెప్పించారట. మరి ఒక స్టార్ హీరో అలాంటి పాత్రలో నటించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…