spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Women MLAs Richest List: దేశంలోనే ఆ ముగ్గురు.. కుబేరుల జాబితాలో ఏపీ ఎమ్మెల్యేలు!

AP Women MLAs Richest List: దేశంలోనే ఆ ముగ్గురు.. కుబేరుల జాబితాలో ఏపీ ఎమ్మెల్యేలు!

AP Women MLAs Richest List: దేశవ్యాప్తంగా నిన్ననే మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం పేరుతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్( association for democratic reforms) సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలోని మహిళా ప్రజాప్రతినిధులకు సంబంధించి 100 కోట్లకు పైగా ఆస్తులు అంటే.. బిలియనీర్లు 14 మంది ఉన్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలోనే మొదటి మూడు స్థానాల్లో ఏపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఆ ముగ్గురు కూటమి పార్టీలకు చెందిన మహిళ ఎమ్మెల్యేలు కావడం విశేషం. మహిళా దినోత్సవం సందర్భంగా ఏడీఆర్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.

Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి

*+చట్టసభల్లో 10 శాతం..
దేశవ్యాప్తంగా 543 మంది ఎంపీలు, 4,123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మొత్తం 4666 మంది ప్రజాప్రతినిధుల్లో.. మహిళలు కేవలం 464 మంది మాత్రమే. అంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 10% మాత్రమే అని ఈ నివేదిక వెల్లడించింది. 543 మంది ఎంపీలు 74 మంది మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 4,413 మంది ఎమ్మెల్యేల్లో 390 మంది ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. అయితే ఎన్నికల అఫీడవిట్లో వివరాల ఆధారంగా వారిపై నమోదైన కేసులు, వారి ఆస్తుల వివరాలను ఏడిఆర్ సంస్థ వెల్లడించింది.

* 14 మంది బిలియనీర్లు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా( women political participation and representation in India) పేరుతో నిన్ననే ఒక నివేదిక విడుదల చేసింది. మహిళా ప్రజాప్రతినిధుల్లో 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ జాబితాలో తొలి స్థానంలో మన రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉన్నారు. ఆమె నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యురాలు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ. ప్రశాంతి రెడ్డి ఆస్తి విలువ అక్షరాలా రూ.716 కోట్లు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఆమె ఉన్నారు. రెండవ స్థానంలో కడప టిడిపి ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ఉన్నారు. ఈమె ఆస్తుల విలువ అక్షరాల రూ.388 కోట్లు. మూడో స్థానంలో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ అక్షరాల రూ.291 కోట్లు.. అంటే దేశంలోనే ఏపీకి చెందిన ముగ్గురు మహిళలు ప్రత్యేక గుర్తింపు సాధించారన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version