Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్!

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో( AP deputy CM Pawan Kalyan ) జాతీయ భావాలు ఎక్కువ. దేశభక్తి, దేశ సమైక్యత విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందుంటారు. కీలక ప్రకటనలు చేస్తారు. ఆయన మరోసారి తన దేశభక్తిని చాటుకుంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతల దృష్ట్యా జాతీయ భద్రత కోసం సర్వమత ప్రార్థనలు చేసిన జనసైనికులకు, సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలిపిన శ్రేణులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని.. ఏకతాటిపైకి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పహల్గాం దాడి విషయంలో ఆది నుంచి పవన్ దూకుడు నిర్ణయాలు ప్రకటించారు. మతం పేరిట జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఖండించారు. ధీటైన సమాధానం చెప్పాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు తాజాగా మరోసారి జాతీయవాదాన్ని బలంగా వినిపించారు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

* ఆ నేతలకు అభినందన..
ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించి జనసేన( janasena ) పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, పత్స మట్ల ధర్మరాజు, పంతం నానాజీ, సుందరపు విజయ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జై కృష్ణ, టి సి వరుణ్, తుమ్మల రామస్వామి, పిఠాపురం ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ లకు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్.

* ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
జమ్మూ కాశ్మీర్( Jammu Kashmir), పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కదిలించిందని.. ఇలాంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ పై దాడులు చేసి ఉగ్రముకలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించి.. భారతదేశానికి రక్షణ కవచంలా నిలిచిన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, రక్షణ బలగాల కోసం పూజలు చేసిన జనసైనికులకు ఈ సందర్భంగా అభినందించారు పవన్ కళ్యాణ్. ఇటీవల జనసైనికులు తమిళనాడులోని దేవసేనని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సష్ట షణ్ముఖ ఆలయాల్లో పూజలు జరిపారు. కర్ణాటక తో పాటు ఏపీలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు, విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో జనసైనికులు పూజలు జరిపారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular