Tollywood Heroine: సినిమాలో కథ డిమాండ్ ను బట్టి తమకు తాము మార్చుకుంటూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ప్రతి సినిమాకు వేరియేషన్స్ చూపించి తమ నటనకు ప్రశంసలు అందుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు ఓవర్ నైట్ లో స్టార్ డం తెచ్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ముద్దుగుమ్మలో కేవలం ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇతర భాషల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్లు కూడా బాగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పటివరకు వేరే భాషల నుంచి తెలుగులోకి వచ్చి స్టార్స్ గా మారిన ముద్దుగుమ్మలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ బ్యూటీ కూడా తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటుంది. రీసెంట్ గా ఈ చిన్నది బాక్సాఫీస్ దగ్గర భారీ హీట్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ బ్యూటీ ఏకంగా ఒకేసారి నాలుగు సినిమా ఆఫర్స్ ను అందుకుంది.
Also Read : రెండవ పెళ్లి వార్తలపై స్పందించిన సమంత మ్యానేజర్..ఈ ట్విస్ట్ ఊహించలేదుగా!
ఈ బ్యూటీ మరెవరో కాదు శ్రీనిధి శెట్టి. మోడల్ గా తన కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీనిధి 2016 లో జరిగిన మిస్ సుప్ర నేషనల్ లో విజేతగా నిలిచింది. ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు కన్నడ, తమిళ సినిమాలలో కూడా హీరోయిన్గా నటిస్తుంది. 2015లో శ్రీనిధి శెట్టి మిస్ కర్ణాటక అలాగే మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్ గెలుచుకుంది. ఇక తర్వాత 2016 లో మిస్ సుప్ర నేషనల్ టైటిల్స్ సొంతం చేసుకుంది. మిస్ సుప్ర నేషనల్ పోటీలలో శ్రీనిధి శెట్టి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఈ టైటిల్ ని సొంతం చేసుకున్న రెండో భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. 2018లో రిలీజ్ అయిన కన్నడ సినిమా కె.జి.యఫ్ చాప్టర్ 1 లో రీనా దేశాయి పాత్ర తో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
కే జి ఎఫ్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక కే జి ఎఫ్ చాప్టర్ 2 లో కూడా ఈమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఈమెకు ఒకేసారి నాలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి.