Pawan Kalyan : పవన్ కళ్యాణ్( Pawan Kalyan) పనితీరుపై ఎటువంటి అనుమానాలు లేవు. ఆయన ప్రజల కోసం పూర్తిస్థాయిలో తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. సినీ రంగంలో తనకంటూ మంచి కెరీర్ ఉన్నా.. రాజకీయాల కోసం తాత్కాలికంగా పక్కన పెట్టారు. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు. కానీ ప్రభుత్వపరంగా కీలకమైన సమావేశాలకు గైర్హాజరు కావడం మాత్రం ఆయనకు మైనస్ గా మారుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. వరుసగా మూడోసారి కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ తీరుపై కాస్త విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ శ్రేణులు సైతం అసంతృప్తితో ఉన్నాయి. కీలకమైన సమావేశాలకు పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం ఏమిటన్న చర్చ ఇప్పుడు ఏపీవ్యాప్తంగా ఉంది.
Also Read : ఆ ఎమ్మెల్యే ఔట్.. మాజీ మంత్రికి చంద్రబాబు పిలుపు!
* కూటమి ప్రభుత్వంలో సింహభాగం..
కూటమి ప్రభుత్వంలో( allians government ) జనసేనకు 12 శాతం వాటా ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మరో ముగ్గురు మంత్రులు కూడా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి తరువాత డిప్యూటీ సీఎం పవన్ అన్నట్టు పరిస్థితి ఉంది. అందరిలోనూ సమభావం తేవాలని సీఎం చంద్రబాబు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టించారు. కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ ఇద్దరు నడిపిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడం మాత్రం ఒక రకమైన చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ప్రభావం చూపాల్సిన పవన్ ఇలా వ్యవహరించడం ఏంటనేది చర్చకు దారితీసింది.
* వెన్ను నొప్పితో వెనుదిరుగు
వాస్తవానికి మంత్రివర్గ సమావేశానికి( Cabinet meeting) హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాదు నుంచి విజయవాడ వచ్చారు. కానీ వెన్ను నొప్పి తిరగబెట్టడంతో తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఉండవచ్చు. కానీ పవన్ హాజరైతే ఆ సమావేశానికి ఒక నిండుదనం వచ్చేది. కూటమి మధ్య సమన్వయం ఉందని చాటి చెప్పే అవకాశం కనిపించేది. కానీ ఇప్పుడు పవన్ హాజరు కాకపోయేసరికి రకరకాల ప్రచారం జరుగుతోంది. కూటమి మధ్య విభేదాలు రావడంతోనే పవన్ సమావేశాలకు హాజరు కావడం లేదని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఒక విధంగా కూటమి సమన్వయానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి కూడా.
* కలెక్టర్ల రివ్యూకు గైర్హాజరు..
మొన్నటికి మొన్న అమరావతిలో( Amaravathi ) కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సైతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. జిల్లాల వారీగా ఎక్కువ శాతం ప్రగతి పవన్ కళ్యాణ్ శాఖలది. కలెక్టర్ల ద్వారా పల్లెపాలనతో పాటు పంచాయతీరాజ్ పాలన సాగుతుంది. అంతటి ప్రాధాన్యం కలిగిన సమావేశానికి పవన్ గైర్హాజరయ్యారు. ఏదో ఒక కారణంతో ఆయన హాజరు కాలేదు. ఇప్పుడు వరుసగా మూడు మంత్రివర్గ సమావేశాలకు సైతం ఆయన ముఖం చాటేశారు. ఈ క్రమంలోనే పవన్ వ్యవహార శైలి పై చర్చ జరుగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. కానీ వరుసగా సమావేశాలకు గైర్హాజరవుతుండడం మాత్రం మైనస్ అవుతోంది.
Also Read : తమిళనాడు గవర్నర్ గా టిడిపి సీనియర్ నేత!