Trump : ట్రేడ్ వార్.. వ్యాపార యుద్ధం.. మొదలు పెట్టింది ట్రంప్. మొదలుపెట్టడం వరకే ఆయన చేతుల్లో ఉంది. ముగించడం ఆయన చేతుల్లో లేదు. ఇది మరో పద్మవ్యూహం లాంటిది. ముందుగా మెక్సికో, చైనా, కెనడాలతో మొదలైన ఈ టారిఫ్ యుద్ధం.. మొత్తం ప్రపంచానికి వ్యాప్తి చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడ్డాయి.
ట్రంప్ మొదటి నుంచి చైనా విషయంలో కఠినంగా ఉంటున్నారు. చైనా అమెరికాను వాడుకుంటోందన్నది ట్రంప్ వాదన.. చైనాతో జరపాల్సిన పోరాటం.. అందరికీ వర్తింపచేయడం నష్టం చేస్తోంది. మిత్రుల కంటే శత్రువులను ఎక్కువగా తెచ్చుకున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ట్రంప్ నిర్ణయాలతో ఎఫెక్ట్ అయ్యాయి.
చైనా తప్పితే అన్ని దేశాలతో అమెరికా సన్నిహిత సంబంధాలకు చూస్తున్నారు. చైనాతోనే ఈ వార్ పరిమితం అయ్యేదేంటంటే.. బ్రహ్మాండంగా అమెరికాకు ఉండేది. చైనా అప్పుల కుప్పల్లో ఉంది. వస్తువులు తయారీ కంటే తక్కువకు అమ్మాల్సిన పరిస్థితిలో ఉంది. కెపాసిటీకి మించి ప్రొడక్షన్ జరిగింది. చైనాను దెబ్బతీయడానికి ట్రేడ్ వార్ చేసుంటే అమెరికాకు, ప్రపంచానికి లాభించేది. ట్రంప్ చేసిన డ్యామేజ్ తో చైనా ఇప్పుడు అప్పర్ హాండ్ తీసుకొని బలపడాలని చూస్తోంది.
ట్రంప్ ఆరంభించిన వ్యాపార యుద్ధం పద్మవ్యూహం లాంటిది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.