KS Jawahar: తిరువూరు విషయంలో చంద్రబాబు( CM Chandrababu) వేరే ఆలోచనతో ఉన్నారా? కొలికపూడి విషయంలో లాభం లేదు అనుకుంటున్నారా? ఆయనను తప్పించడమే మేలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చారు కొలిక పూడి. చంద్రబాబు కూడా ఎంతో నమ్మకంతో శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చారు. చంద్రబాబు అంచనాలకు అనుగుణంగా కొలికపూడి గెలిచారు. కానీ గెలిచింది మొదలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. చంద్రబాబుకు లేనిపోని తలవొంపులు తీసుకొస్తున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు తిరువూరు నియోజకవర్గ విషయంలో ప్రత్యేక ఆలోచనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: గట్టి ప్రయత్నాలు చేస్తున్న పురందేశ్వరి!
* అమరావతి ఉద్యమ నేపథ్యం.. అమరావతి( Amaravathi ) ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు కొలికపూడి శ్రీనివాసరావు. అమరావతి ఉద్యమానికి బలమైన మద్దతు దారుడుగా నిలిచారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుకు అభిమానిగా మారిపోయారు. ఆయన నాయకత్వాన్ని మరింత సమర్థించేలా మాట్లాడేవారు. ఈ క్రమంలో టీవీ డిబేట్ లలో పాల్గొని అమరావతి వాయిస్ ను వినిపించేవారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఎల్లో మీడియా అధినేత ఒకరు కొలికపూడిని ప్రోత్సహించారు. ఏకంగా చంద్రబాబు కు సిఫారసు చేశారు. అందుకే చంద్రబాబు సైతం తిరువూరు నుంచి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంలో గెలిచిన శ్రీనివాసరావు పార్టీకి విధేయతగా పనిచేయడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకే అధినేత చంద్రబాబు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సి వచ్చింది.
* అప్పట్లో అలా..
2014 ఎన్నికల్లో తిరువూరు( thiruvuru ) నుంచి జవహర్ కు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో జవహర్ అనూహ్య విజయం సాధించారు. దీంతో చంద్రబాబు తన క్యాబినెట్లో జవహర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఐదేళ్లపాటు చంద్రబాబు క్యాబినెట్లో జవహర్ కొనసాగారు. 2019 ఎన్నికల్లో సైతం అదే జవహర్ కు తిరువూరు నుంచి అవకాశం కల్పించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు జవహర్. అయితే కొన్ని అంశాల్లో వెనుకబాటు కారణంగా జవహర్ కు ఈ ఎన్నికల్లో పక్కన పెట్టారు చంద్రబాబు. అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న జవహర్ అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం తగ్గించారు. అధినేత విషయంలో కీనుక వహిస్తూ వచ్చారు.
* జవహర్ కు బాధ్యతలు..
అయితే తిరువూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే విషయంలో అసంతృప్తి పెరుగుతోంది. ఆయన సైతం తరచూ వివాదాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తన ఆలోచన మార్చుకున్నారు. జవహర్ కు ప్రత్యేకంగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వివాహ వేడుకలకు హాజరైన చంద్రబాబు జవహర్ ను పిలిచి ఏకాంతంగా మాట్లాడారు. తిరువూరు విషయంలో యాక్టివ్ కావాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎమ్మెల్యే కొలికపూడి ఔట్ అయినట్టే. అదే జరిగితే అధికార టిడిపి నుంచి తొలి వికెట్ కొలికపూడి దే.