Pawan Kalyan New Look: పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ). తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్టార్ డం ఉన్న హీరో. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ విజయం కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఆయన హావభావాలు, వస్త్రధారణ విభిన్నంగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో స్టైల్ లో కనిపిస్తున్నారు. అయితే సాధారణంగా రాజకీయ పార్టీల నేతలు దోతి వంటి వాటిలో ఎక్కువగా కనిపిస్తారు. ఖద్దరుదారణ కూడా చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ ఇటీవల డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. క్యాజువల్ డ్రెస్సెస్ తో పాటు కార్పొరేట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇది అందరిలోనూ ఆశ్చర్యం వేస్తోంది. సహజంగానే సినీ పరిశ్రమ నుంచి రావడంతో ఫుల్ గ్లామర్ పవన్ కళ్యాణ్ ది. అటువంటిది ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కాకుండా.. ఓ కార్పొరేట్ ఉద్యోగి తరహాలో కనిపిస్తున్నారు పవన్.
* సాధారణ నేత మాదిరిగానే..
సినిమా రంగంలో అగ్ర కథానాయకుడిగా కొనసాగారు పవన్ కళ్యాణ్. ఆయనది చరిష్మ ఉన్న ముఖం. అయితే అంతటి స్టార్ డం ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేసరికి ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మారిపోయారు. కుర్తాతో ఎక్కువగా కనిపించేవారు. ఆపై మెరిసిన గడ్డంతో, తల జిత్తుతో ఎక్కువగా బయటకు వచ్చేవారు. అయితే ఇటీవల మాత్రం ఆయన హెయిర్ స్టైల్ లో మార్పు వచ్చింది. క్యాజువల్ ఫ్యాంట్, షర్ట్ లో అఫీషియల్ లుక్ లో కనిపిస్తున్నారు. క్యాబినెట్ సమావేశాలతో పాటు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు అలానే వస్తున్నారు. ఈ న్యూ లుక్ ను ఆయన ఎంత మజా చేస్తున్నారో తెలియదు కానీ.. జనసైనికులు మాత్రం చాలా ఆనందంతో గడుపుతున్నారు.
* అన్నిచోట్ల క్రేజ్..
అయితే ప్రజలతో పాటు జనసైనికులు పవన్ కళ్యాణ్ విషయంలో రెండు పద్ధతుల్లో ఫీల్ అవుతుంటారు. ఒకటి అభిమాన కథానాయకుడు, ఆపై ఇష్టమైన నేత. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా అదే క్రేజ్. చివరకు మంత్రివర్గ సమావేశాలు అయినప్పుడు, మంత్రులు ప్రత్యేకంగా కలుసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తో ఫోటోలు దిగేందుకు తోటి మంత్రులు కూడా ఆసక్తి చూపుతుంటారు. అంతలా ఉంటుంది ఆయన చరిష్మ. ఆపై ప్రజల విషయంలో ఆయన వ్యవహార శైలి కూడా అలానే ఉంటుంది. చాలా అంకితభావంతో పనిచేస్తారు. అయితే గత కొంతకాలం కిందట వరకు ఆయన సాధారణ వస్త్రాలతోనే కనిపించేవారు. కానీ ఇటీవల అఫీషియల్ లుక్ తో కనిపిస్తున్నారు. ఇది జనసైనికులకు ముమ్మాటికి ఇష్టపడే విషయం కూడా. అయితే పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా ప్రత్యర్థులకు నచ్చదు. ఎందుకంటే ఆయన వారి ఓటమిపై అంతలా ప్రభావం చూపారు కాబట్టి. అందుకే ఆయన అదిరేటి డ్రెస్ వేసినా వారికి నచ్చదు. అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ను చూసి ఫిదా అవుతున్నారు.